సకుటుంబంగా చూస్తారు

సకుటుంబంగా చూస్తారు

2
TMedia (Telugu News) :

సకుటుంబంగా చూస్తారు

టీ మీడియా,ఆగస్టు 25, హైదరాబాద్‌ : నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘కృష్ణ వ్రిందా విహారి’. ఈ చిత్రంలో షెర్లీ సెటియా నాయికగా నటిస్తున్నది. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కథతో దర్శకుడు అనీష్‌ ఆర్‌ కృష్ణ రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినిమా గురించి నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ…‘ఇది వినోదాత్మక కుటుంబ కథా చిత్రం. పల్లెటూరిలో ఉండే బ్రాహ్మణ యువకుడిగా నాగశౌర్య నటించారు. సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిగా, ప్రేమికుడిగా, స్నేహితుడిగా విభిన్న కోణాల్లో ఆయన కనిపిస్తారు.

 

Also Read : పోరాటం మళ్లీ మొదలు

 

శౌర్య కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుందని ఆశిస్తున్నాం. బ్రాహ్మణ పాత్రలో హావభావాలు పలికించేందుకు రెండు నెలల ట్రైనింగ్‌ తీసుకున్నాడు.మంచి కథ, ఇప్పటిదాకా వచ్చిన ఫుటేజ్‌ చూశాం. మేము అనుకున్నట్లు సినిమా వస్తున్నది. అందుకే విజయంపై నమ్మకంగా ఉన్నాం. రాధిక, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ, రాహుల్‌ రామకృష్ణ పాత్రలు ఆకట్టుకునేలా ఉంటాయి. దర్శకుడు అనీష్‌ తనకు కలిసొచ్చిన ఎంటర్‌టైనర్‌ జానర్‌లో ఈ సినిమా తెరకెక్కించాడు.షెర్లీ రూపంలో తెలుగు తెరకు మరో మంచి నాయిక దొరికింది. మా అబ్బాయి అని కాకుండా సినిమా కోసం కావాల్సినంత ఖర్చు పెట్టాం. సినిమా నిర్మాణం వద్దని అనుకుంటున్నా, ఎప్పటికప్పుడు నిర్ణయం మార్చుకోవాల్సి వస్తున్నది. ఇకపై మిగతా హీరోలతోనూ సినిమాలు నిర్మించాలని ఉంది’ అని చెప్పింది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube