‘ఇండియన్‌-2’ షూటింగ్‌ పునః ప్రారంభం

‘ఇండియన్‌-2’ షూటింగ్‌ పునః ప్రారంభం

0
TMedia (Telugu News) :

‘ఇండియన్‌-2’ షూటింగ్‌ పునః ప్రారంభం

టీ మీడియా,సెప్టెంబర్ 22,సినిమా: సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబోలుంటాయి. ఆ కాంబోలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీప్రముఖులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో శంకర్‌-కమల హాసన్‌ కాంబో ఒకటి. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘భారతీయుడు’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. సినిమా వచ్చి 21 ఏళ్ళు అవుతున్నా ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఈ మూవీపై ఉన్న క్రేజ్‌ తగ్గలేదు. కాగా ఇప్పుడు ‘ఇండియన్-2’ తెరకెక్కడానికి సిద్ధమైంది. అయితే గతంలోనే ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. కానీ శంకర్‌కు, నిర్మాతలకు మధ్య బడ్జెట్‌ సమస్యలు రావడంతో షూటింగ్‌ ఆగిపోయింది. కాగా తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది.‘ఇండియన్-2’ షూటింగ్‌ గురువారం ప్రారంభమైనట్లు కమల్ హాసన్‌ అధికారంగా ప్రకటించాడు. అంతేకాకుండా శంకర్‌తో షూటింగ్‌ స్పాట్‌లో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు.

Also Read : AK61 పోస్టర్‌ రిలీజ్‌.. మాస్‌ లుక్‌లో అదరగొడుతున్న అజిత్‌

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌జియాంట్‌ మూవీస్‌ బ్యానర్‌లపై ఏ.సుభాస్కరణ్‌, ఉదయనిధి స్టాలిన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఏ.ఆర్‌ రెహమాన్‌ స్వర కల్పనలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ద్వితియార్థంలో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక శంకర్ ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ‘Rc15’ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్‌లను శంకర్ ఏకకాలంలో జరుపనున్నాడు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube