సంక్రాంతి బరిలో బాలయ్య.. మరి ‘మెగా154’ సంగతేంటి?

సంక్రాంతి బరిలో బాలయ్య.. మరి ‘మెగా154’ సంగతేంటి?

1
TMedia (Telugu News) :

సంక్రాంతి బరిలో బాలయ్య.. మరి ‘మెగా154’ సంగతేంటి?

 

NBK107 | సంక్రాంతి బరిలో బాలయ్య.. మరి ‘మెగా154’ సంగతేంటి?
టీ మీడియా,అక్టోబర్ 21, సినిమా

‘అఖండ’ చిత్రంతో నందమూరి అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ నింపాడు బాలకృష్ణ. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బాస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రంతో వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టాడు. ప్ర‌స్తుతం అదే జోష్‌తో బాలకృష్ణ త‌న త‌దుపరి సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయ‌న హీరోగా గోపిచంద్ మ‌లినేని ద‌ర్శక‌త్వంలో పొలిటిక‌ల్ ట‌చ్ ఉన్న మాస్ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ‘క్రాక్’ వంటి బ్లాక్ బ‌స్టర్ త‌ర్వాత గోపిచంద్ మ‌లినేని.. బాల‌కృష్ణతో సినిమా చేయ‌నుండటంతో ప్రేక్షకుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

 

Also Read : అల్లు శిరీష్ ‘ఊర్వసివో రాక్షసివో’ నుండి క్రేజీ అప్‌డేట్‌..!

ఈ చిత్రాన్ని మైత్రీ సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ‘మెగా154’ను కూడా మైత్రీ సంస్థ నిర్మిస్తుంది. కాగా మెగా 154 పోస్ట్‌ ప్రొడక్షన్‌కు కాస్త ఎక్కువ టైం పడుతుందట. దాంతో చిరు సినిమా సంక్రాంతికి వచ్చే చాన్స్‌ తక్కువగా ఉందట. ఈ క్రమంలో మైత్రీ సంస్థ బాలయ్య సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేసే ప్లాన్‌ చేస్తుందట. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న NBK107  ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటుంది. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మాత్రం మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.‘NBK107’ టైటిల్‌ను శుక్రవారం రాత్రి 8:15 నిమిషాలకు కర్నూలు కొండా రెడ్డి బురుజు దగ్గర లాంచ్‌ చేయనున్నారు. అవుట్ అండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్‌ రోల్‌లో నటించనున్నట్లు టాక్‌. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్‌ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube