వాల్తేరు వీరయ్య బాస్‌ పార్టీ సాంగ్ ఊరమాస్‌ ప్రోమో.. వీడియో

వాల్తేరు వీరయ్య బాస్‌ పార్టీ సాంగ్ ఊరమాస్‌ ప్రోమో.. వీడియో

0
TMedia (Telugu News) :

వాల్తేరు వీరయ్య బాస్‌ పార్టీ సాంగ్ ఊరమాస్‌ ప్రోమో.. వీడియో

 

 

టీ మీడియా, నవంబర్ 22, సినిమా

టాలీవుడ్‌ స్టార్ హీరో చిరంజీవి టైటిల్‌ రోల్ చేస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య  మాస్‌ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాబీ (కేఎస్ ర‌వీంద్ర‌) దర్శకత్వం వహిస్తున్నాడు. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్‌ సింగిల్ అప్‌డేట్‌ ఇచ్చేశారు మేకర్స్. వెల్‌కమ్‌ టు ది బిగ్గెస్ట్‌ పార్టీ.. బాస్‌ పార్టీ అంటూ రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ బాస్‌ పార్టీ సాంగ్ ప్రోమోను షేర్ చేశాడు. ఊరమాస్‌గా ఈ పార్టీ సాంగ్ సాగనున్నట్టు ప్రోమోతో అర్ఠమవుతుంది. బాస్‌ పార్టీ ఫుల్ సాంగ్ రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ టీజర్‌ నెట్టింట్లో హల్‌ చల్ చేస్తోంది. చిరంజీవి మాస్‌ అవతార్‌లో అందరినీ ఎంటర్‌టైన్‌ చేయనున్నట్టు టీజర్‌తో చెప్పేశాడు డైరెక్టర్‌. మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతం అందిస్తున్నట్టు తాజా ప్రోమోతో అర్థమవుతుంది. బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. వాల్తేరు వీరయ్య చిత్రంలో ర‌వితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న ఈ మూవీలో శృతిహాస‌న్ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. వాల్తేరు వీరయ్య 2023 జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube