అప్పుడే ఓటీటీలోకి లవ్‌టుడే మూవీ.. కానీ?

అప్పుడే ఓటీటీలోకి లవ్‌టుడే మూవీ.. కానీ?

1
TMedia (Telugu News) :

అప్పుడే ఓటీటీలోకి లవ్‌టుడే మూవీ.. కానీ?

 

టీ మీడియా, నవంబర్ 28 :

ఈ మధ్య కాలంలో భాషతో సంబంధంలేకుండా కథ, కథనం కొత్తగా ఉంటే చాలు ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలను ఆదరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్నో పరభాష సినిమాలు తెలుగులో రిలీజై ఘన విజయం సాధించాయి. ఈ క్రమంలోనే తాజాగా రిలీజైన లవ్‌టుడే సినిమా కూడా తెలుగులో భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. రూ.5 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం తమిళంలో రూ.70 కోట్ల కలెక్షన్‌లు సాధించి సంచలనం సృష్టించింది. ఇక తెలుగులో రెండు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ పూర్తి చేసుకుని సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది.

 

Also Read : పవిత్ర లోకేష్ ఫిర్యాదుతో యాక్షన్‌లోకి దిగిన పోలీసులు

 

ఈ చిత్రాన్ని ప్రదీప్‌ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా అప్పుడే ఓటీటీ బాట పట్టింది. ఈ సినిమాను డిసెంబర్‌ 2నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ చిత్రం కేవలం తమిళ భాషలోనే రిలీజవుతుంది. తెలుగులో ఈ సినిమాకు మంచి కలెక్షన్‌లు వస్తుండటంతో మరో రెండు మూడు వారాల తర్వాత తెలుగులో స్ట్రీమింగ్‌ చేయాలని మేకర్స్ భావించారట. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్‌రాజు రిలీజ్‌ చేశాడు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైనమెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్‌. గణేష్‌, కల్పతి ఎస్‌. సురేష్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ప్రదీప్‌కు జోడీగా ఇవానా రవి నటించింది. సత్యరాజ్‌, రాధికా కీలకపాత్రలు పోషించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube