నాన్‌స్టాప్ షూటింగ్‌కు మహేశ్‌బాబు ప్లాన్..!
టీ మీడియా, నవంబర్ 28
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబీ 28 సినిమా చేస్తున్నాడని తెలిసిందే. కొన్ని రోజుల క్రితం షూటింగ్ మొదలవగా.. కృష్ణ ఆకస్మిక మరణంతో నిలిచిపోయింది. కొన్ని రోజులుగా తండ్రి సంస్మరణ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు మహేశ్‌బాబు. ఈ నేపథ్యంలో ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ మొదలయ్యేందుకు ఇంకా టైం పట్టొచ్చని అంతా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఫిలింనగర్ సర్కిల్ టాక్ ప్రకారం డిసెంబర్ మొదటి వారం నుంచి ఎస్ఎస్ఎంబీ 28 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందట.
Also Read : అప్పుడే ఓటీటీలోకి లవ్‌టుడే మూవీ.. కానీ?
అంతేకాదు సినిమా షూటింగ్ పూర్తయ్యే దాకి విశ్రాంతి తీసుకోవద్దని మహేశ్ బాబు ఫిక్స్ అయినట్టు టాక్. 5 నెలల డెడ్లైన్లో నాన్‌స్టాప్‌గా ఎస్ఎస్ఎంబీ 28 చిత్రీకరణ జరిపి.. వచ్చే ఏడాది ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేయాలని నిర్ణయించినట్టు ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఎస్ఎస్ఎంబీ 28లో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. శ్రీలీల సెకండ్ హీరోయిన్గా మెరవనుంది. త్రివిక్రమ్ మొదటిసారి ఎస్ఎస్ఎంబీ 28లో ఐటెంసాంగ్ పెట్టబోతున్నాడు. ఈ ఐటెం సాంగ్‌లో రష్మిక మెరువనుందని క్రేజీ టాక్ నడుస్తోండగా.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube