ఫస్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్.. డేంజర్ బెల్స్ మోగిస్తున్న అడివి శేష్

ఫస్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్.. డేంజర్ బెల్స్ మోగిస్తున్న అడివి శేష్

1
TMedia (Telugu News) :

ఫస్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్.. డేంజర్ బెల్స్ మోగిస్తున్న అడివి శేష్

 

టీ మీడియా, సినిమా

టాలీవుడ్ యంగ్‌ సెన్సేషన్‌ అడివి శేష్ ప్రతీ సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు . ఈయన సినిమా వచ్చిందంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోతున్నారు అభిమానులు. అంత ఖచ్చితంగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు శేష్. తాజాగా ఈయన నటించిన హిట్ 2 కూడా అద్భుతమైన విజయం సాధించింది. డాక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమాకు నాచురల్ స్టార్ నాని నిర్మాత. భారీ అంచనాల మధ్య విడుదలైన హిట్ 2 అంచనాలు అందుకోవడమే కాకుండా కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఇవ్వని అయిపోయింది.మర్డర్ మిస్టరీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన అడివి శేష్.. తాజాగా మరోసారి తన పట్టు చూపించాడు. ఈ సినిమా మూడు రోజుల్లోనే నైజాంలో 5 కోట్ల 10 లక్షల షేర్ వసూలు చేసింది. సీడెడ్ లో కోటి 15 లక్షలు.. ఉత్తరాంధ్రలో కోటి 41 లక్షలు.. ఈస్ట్ వెస్ట్ లో కలిపి కోటి 10 లక్షలు.. గుంటూరులో 68 లక్షలు.. కృష్ణ, నెల్లూరులో కలిపి మరో 1 రూపాయల షేర్ వసూలు చేసింది.

 

Also Read : తెలుగు సినిమాల్లో సత్తా చాటుతున్న విదేశీ భామలు..

 

మొత్తంగా మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 10.5 కోట్ల షేర్ వసూలు చేసింది హిట్ సీక్వెల్.అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కోటి 20 లక్షలు.. ఓవర్సీస్ లో 3 కోట్ల 20 లక్షలు వసూలు చేసి.. ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల షేర్ సొంతం చేసుకుని హిట్ 2. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఇవ్వాలంటే మరో 9 లక్షలు వసూలు చేస్తే చాలు. సోమవారం కూడా వసూలు స్ట్రాంగ్ గా ఉండడంతో 20 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా నైజాం ప్లస్ ఓవర్సీస్ లో అడవి శేష్ సినిమాలకు అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే శేష్ మార్కెట్ మరింత పెరగడం ఖాయం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube