అల్లు శిరీష్ ‘ఊర్వసివో రాక్షసివో’ నుండి క్రేజీ అప్‌డేట్‌..!

అల్లు శిరీష్ ‘ఊర్వసివో రాక్షసివో’ నుండి క్రేజీ అప్‌డేట్‌..!

2
TMedia (Telugu News) :

అల్లు శిరీష్ ‘ఊర్వసివో రాక్షసివో’ నుండి క్రేజీ అప్‌డేట్‌..!

టీ మీడియా,అక్టోబర్ 21, సినిమా: టాలీవుడ్‌ యంగ్‌ హీరో అల్లు శిరీష్ మూడేళ్ళు గ్యాప్‌ తీసుకుని ‘ఊర్వసివో రాక్షసివో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. రాకేశ్‌ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాదే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. కానీ పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. మొదట్లో ఈ చిత్రానికి ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్‌ను ప్రకటించారు. ఇక ఇటీవలే టైటిల్‌ పేరునూ మారుస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. రోమ్‌-కామ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్‌ 4న రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు.

 

 

తాజాగా మేకర్స్ మరో అప్‌డేట్‌ ప్రకటించారు.ఈ చిత్రంలోని ‘కలిసుంటే’ అంటూ సాగే రొమాంటిక్‌ మెలోడీ సాంగ్‌ను శనివారం సాయంత్రం 4గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. అచ్చు రాజమణి స్వర పరిచిన ఈ పాటను కేకే రచించగా.. ఆర్మాన్ మాలిక్‌ ఆలపించాడు. ఇది వరకే రిలీజైన మాయరే, దీంతానా సాంగ్‌లకు విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్‌, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శిరీష్‌కు జోడీగా అను ఇమ్మాన్యూయెల్‌ హీరోయిన్‌గా నటించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube