రామ్ చరణ్ సినిమా కోసం శంకర్ భారీ ప్లాన్

రామ్ చరణ్ సినిమా కోసం శంకర్ భారీ ప్లాన్

2
TMedia (Telugu News) :

రామ్ చరణ్ సినిమా కోసం శంకర్ భారీ ప్లాన్

టీ మీడియా, అక్టోబర్ 25, సినిమా

రామ్ చరణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆర్సి 15 ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్…చరణ్ కాంబోలో రాబోతున్న ఈసినిమా పై ఇప్పటికే భారీగానే అంచనాలను క్రియేట్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని భారీ బడ్డె్ట్‏తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‏గా నటిస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమా షెడ్యూల్‌ను రాజ‌మండ్రి, హైద‌రాబాద్‌ ల‌లో పూర్తి చేశారు. అలాగే నెక్ట్స్ షెడ్యూల్ కోసం శంక‌ర్ ప్లాన్ కూడా చేసేశారు.

Also Read : నేడే సూర్యగ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల మూసివేత

ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.నెక్ట్స్ షెడ్యూల్‌ను న్యూజిలాండ్‌లో ప్లాన్ చేశారు. ఇందులో ఓ రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీల‌తో రొమాంటిక్ సాంగ్‌ను షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. దాదాపు ఏకంగా రూ.23 కోట్లు ఖ‌ర్చు పెట్టి ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ సినిమాల్లోనే తెర‌కెక్కించ‌నంత గ్రాండియ‌ర్‌గా చేయ‌బోతున్నార‌ని టాక్‌.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube