స‌మంత యశోద ట్రైలర్‌ రిలీజ్‌ డేట్

స‌మంత యశోద ట్రైలర్‌ రిలీజ్‌ డేట్

3
TMedia (Telugu News) :

స‌మంత యశోద ట్రైలర్‌ రిలీజ్‌ డేట్

 

టీ మీడియా, అక్టోబర్ 25,సినిమా

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత లీడ్ రోల్‌ పోషిస్తున్న చిత్రం యశోద. హరి-హరీష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్‌ ఇండియా కథాంశంతో యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ నెట్టింట్లో మంచి వ్యూస్ రాబడుతోంది. ఈ చిత్రాన్ని నవంబర్‌ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇపుడు ట్రైలర్‌ అప్ డేట్‌ వీడియోను షేర్ చేశారు.

Also Read : రామ్ చరణ్ సినిమా కోసం శంకర్ భారీ ప్లాన్

అక్టోబర్‌ 27న సాయంత్రం 5.36 గంటలకు ట్రైలర్‌ లాంఛ్ చేస్తున్నట్టు తెలిపారు. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రావు రమేశ్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వస్తున్న యశోదను శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube