సమంత మహానటి స్థాయికి వెళ్లగలదన్న సురేశ్‌బాబు.. 

సమంత మహానటి స్థాయికి వెళ్లగలదన్న సురేశ్‌బాబు.. 

2
TMedia (Telugu News) :

సమంత మహానటి స్థాయికి వెళ్లగలదన్న సురేశ్‌బాబు.. 

 

టి మీడియా, సినిమా

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2’ డబుల్‌ సందడితో దూసుకుపోతోంది. ఈ మధ్య కాలంలో ఈ టాక్‌ షోకు వచ్చినంత క్రేజ్‌ దేనికీ రాలేదనండంలో అతిషయోక్తి లేదు. సీజన్‌-1కు అనూహ్య రెస్పాన్స్‌ రావడంతో ఆహా సంస్థ సీజన్‌-2ను ఇటీవలే స్టార్ట్‌ చేసింది. ఈ షోలో సినీ ప్రముఖుల నుండి రాజకీయ నాయకుల వరకు అందరితో బాలయ్య చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. కాగా, లెజెండరీ డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, కే రాఘవేంద్రరావు, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌తో త్వరలో కొత్త ఎపిసోడ్‌ రాబోతున్న విషయం తెలిసిందే.

 

Also Read : కోటి పరిహారం ఇవ్వాలి

 

ఇందుకు సంబంధించిన ప్రోమోను కూడా ఆహీ టీం ఇప్పటికే విడుదల చేసింది. అయితే షోలో భాగంగా సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌కు బాలకృష్ణ పలు ప్రశ్నలు వేశారు. ‘ఈ జనరేషన్‌ హీరోయిన్లలో మహానటి స్థాయికి వెళ్లగలిగే తార ఎవరని మీరు అనుకుంటున్నారు..?’ అని అడగ్గా.. ‘సమంత’ అని ఇద్దరూ సమాధానమిస్తారు. ‘ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో అవ్వగలిగితే ఆ అమ్మాయి (సమంత) ఒక్కటే ఆ స్థాయికి వెళ్లగలదు’ అంటూ సురేశ్‌బాబు చెప్పుకొచ్చారు. కాగా, సురేశ్‌బాబు కామెంట్‌పై తాజాగా సమంత స్పందించింది. వీడియో క్లిప్‌ను రీట్వీట్‌ చేస్తూ.. లవ్‌ సింబల్‌ను జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు, వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube