మహానంది మండలంలోని వివిధ సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు వచ్చే ప్రజలను పలుమార్లు తిప్పించుకోవద్దని, సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు తమవంతు కృషి చేయాలని మహానంది మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని కోరారు. బుక్కాపురం గ్రామంలోని పొదుపు భవనంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ యశస్విని మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా వంతు కృషి తప్పకుండా చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుత సీజన్లో కరోనాతో పాటు కొత్త వేరియంట్లు వచ్చే ప్రమాదం ఉందని వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఒన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం అద్భుతమైన పథకం అని ఎమ్మెల్యే శిల్పా పేర్కొన్నారు.కేవలం పది వేల రూపాయలతో సొంత ఇంటిపై ఉన్న రుణాలు మాఫీ చేసుకొని సంపూర్ణ హక్కు పొందవచ్చు అని సూచించారు.
ఈ కార్యక్రమంలో మహనంది ఎస్ ఐ సి సి నాగార్జున రెడ్డి, హౌసింగ్ డీఈ ఉమామహేశ్వరరావు,తాసిల్దార్ జనార్దన్ శెట్టి, విద్యుత్ శాఖ ఏఈ ప్రబాకర్ రెడ్డి, ఎంపిడిఓ సుబ్బరాజు, పంచాయతీ సెక్రటేరీలు, విఆర్వోలు, సచివాలయ సిబ్బంది, సర్పంచులు, వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.