డీసీసీబీ డైరెక్టర్ వేముల శ్రీనివాసరావు మృతి పట్ల ఎంపీ నామ సంతాపం

-ఫోన్లో వాకుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ నామ

0
TMedia (Telugu News) :

డీసీసీబీ డైరెక్టర్ వేముల శ్రీనివాసరావు మృతి పట్ల ఎంపీ నామ సంతాపం
-ఫోన్లో వాకుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ నామ

టిమీడియా, డిసెంబర్ 26,ఖమ్మం :డీసీసీబీ డైరెక్టర్, ముదిగొండ మండలం మల్లన్న పాలెం సహకార సంఘం అధ్యక్షుడు వేముల శ్రీనివాసరావు మృతి పట్ల బీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు.నిత్యం ప్రజా సేవలో ఉండే శ్రీనివాసరావు మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని నామ పేర్కొన్నారు. సహకార సంఘం అధ్యక్షుడిగా రైతులకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో నామ ఫోన్లో మాట్లాడి పరామర్శించారు.

Also Read : బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడి పై కేసు నమోదు

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube