కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఎంపీ గురుమూర్తి భేటీ

రహదారుల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ

1
TMedia (Telugu News) :

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఎంపీ గురుమూర్తి భేటీ
– రహదారుల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ
టి మీడియా,ఆగస్టు4,ఢిల్లీ: లో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖా మంత్రితో భేటీ అయిన తిరుపతి ఎంపీ తిరుపతి పార్లమెంట్ పరిధిలో రహదారుల అభివృద్ధి గూర్చి ఆయనకు వివరించారు. పలు కొత్త రహదారుల నిర్మించాల్సిన ఆవశ్యకత గూర్చి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పూతలపట్టు నుండి నాయుడుపేట వరకు 6 లేన్ల గా విస్తరింపబడుతున్న జాతీయ రహదారి – 71 లో రామానుజపల్లి కూడలి, అవిలాల క్రాస్, తనపల్లి క్రాస్, దగ్గర నిత్యం రద్దీ ఎక్కువగా ఉంటుందని చుట్టూ పక్కల గ్రామాల నుండి తమ వ్యవసాయ ఉత్పత్తులని ఈ మార్గాల ద్వారా తిరుపతి పట్టణానికి చేరవేస్తారని అలాగే నిత్యం వేలసంఖ్యలో విద్యార్థులు ఈ మార్గాల ద్వారా ప్రయాణిస్తారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రేణిగుంట మండలం కురకాల్వ దగ్గర స్విమ్స్ కికేటాయింపబడిన స్థలం ఉండటంతో అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్ నిర్మించాలని ప్రతిపాదనలుసిద్దమయ్యాయని పైన మూడు ప్రదేశాలలో రోడ్డు కమ్ ఓవర్ బ్రిడ్జిలు మంజూరు చేయాలనీ విన్నవించారు. ఈ రహదారి తిరుపతి పార్లమెంట్ పరిధిలో 57 కి.మి గా ఉందని ఇందులో వివిధ ప్రదేశాలలో 29 కి.మి కు మాత్రమే సర్వీస్ రోడ్ మంజూరు అయ్యిందని ఈ జాతీయ రహదారిలో భారీ ట్రాఫిక్ ఉండడం వలన రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పూర్తిగా సర్వీస్ రోడ్డు నిర్మించిన యెడల ప్రమాదాలు నివారించవచ్చని ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.

 

Also Read : నూతన జడ్జిలుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం

 

నాయుడుపేట నుండి అంటే పండ్లూరు, పున్నేపల్లి, కరబల్లవోలు, మనవలి, సగుటూరు గ్రామాలకు వెళ్లే మార్గంలో శిధిలావస్థలో ఉన్న వంతెన అప్ గ్రేడేషన్ కోసం 46కోట్లరూపాయలతోప్రతిపాదనలు చేయడం జరిగినదని చెప్పారు ఈ వంతెన పూర్తయితే సంబంధిత గ్రామాల ప్రజలకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని ఆయన అన్నారు. వెంకటగిరి నియోజకవర్గం పరిధిలో గొడ్డేరు నదిపై నాయుడుపేట నుండి రాపూరు రోడ్ లో 39/4 కి.మీ దగ్గర రూ.5.75 కోట్లతో, వెంకటగిరి నుండి కోడూరు రోడ్ లో గొడ్డేరు నదిపై 7/2 కి.మీ దగ్గర రూ.6.55 కోట్లతో, వెంకటగిరి నుండి కుర్జగుంట రోడ్ లో 3/6 కి.మీ దగ్గర కైవల్య నదిపై రూ.5.3 కోట్లతో, వెంకటగిరి నుండి మోపూరు రోడ్ లో 3/6 కి.మీ దగ్గర గొడ్డేరు నదిపై రూ.5.25 కోట్లతో, బంగారుపేట మీదుగా హస్తకావేరి, నిదిగాళ్లు వెళ్లే మార్గంలో 4 /10 కి.మీ దగ్గర స్థానిక వాగుపై రూ.2.97 కోట్లతో, నిండలి,దగ్గవోలు, పాతనాలపాడు రోడ్డు కి.మీ.0/ 10 వద్ద కైవల్య నదిపై రూ.7.5 కోట్లతో నిండలి వెళ్లే మార్గంలో కైవల్య నదిపై 0/10 కి.మీ దగ్గర 6.98 కోట్లతో సిఆర్ఐఎఫ్ నిధులతో ఆర్&బి రోడ్డుపై హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేయడం జరిగిందని తెలియజేసారు.తమిళనాడులోని పలు ప్రాతాలనుంచి ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీకాళహస్తి పట్టణానికి అనునిత్యం వేలసంఖ్యలో భక్తులు ప్రయాణిస్తారని, ఈ ప్రాంతంలోని శ్రీ సిటీ పారిశ్రామికవాడ వలన తడ నుంచి శ్రీకాళహస్తి మీదుగా భారీ వాహనాలు ప్రయాణిస్తుంటాయని ఈ రోడ్డు ప్రమాదకరమైన మలుపులతో ఉంటుందని ఈ రహదారిపై గతంలో కంటే రద్దీ రెట్టింపు అయ్యిందని ట్రాఫిక్ తీవ్రత ఎక్కువైందని ఈ రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి త్వరితగతిన రహదారిని విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని అభ్యర్దించడం జరిగిందని తెలియజేసారు. అలాగే మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాల గూర్చి కూడా ఆయనకు ప్రతిపాదనలు సమర్పించామని అందుకు గౌరవ మంత్రి నితిన్ఎం గడ్కరీ సానుకూలంగా స్పందించారని ఎంపీ గురుమూర్తి గారు తెలియజేసారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube