వరద పరిస్థితి పై ఢిల్లీ నుంచి ఎంపీ నామ అరా

అధికారులు తో ఫోన్ లో సమీక్ష

1
TMedia (Telugu News) :

వరద పరిస్థితి పై ఢిల్లీ నుంచి ఎంపీ నామ అరా
-అధికారులు తో ఫోన్ లో సమీక్ష

-భయపడాల్సిన అవసరం లేదు

టి మీడియా, జులై12,ఖమ్మం: ఖమ్మం జ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో సహా ఎగువున పెద్ద ఎత్తున కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి కి భారీగా వరద పోటెత్తి , ఎజెన్సీకి వరద ముప్పు ఏర్పడడంతో టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత , ఉమ్మడి ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సంబంధిత జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడుతూ పరిస్థితిని తెలుసుకుంటూ సహాయక చర్యలపై అధికారులకు తగు సూచనలు చేస్తున్నారు. భద్రాచలం వద్ద సోమవారం సాయంత్రం గోదావరి నీటి మట్టం 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో నామ సత్వరమే అధికారులతో మాట్లాడి, ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి, సహాయ సహకారాలను అందించాలని సూచించారు .గోదావరి కి భారీగా వరద నీరు పోటెత్తడంతో భద్రాచలం ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడం, గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించడంతో పాటు కాజ్ వేలు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుందడంతో ప్రజలకు నామ ధైర్యం చెప్పారు. భయ పడవద్దని, ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ప్రతి క్షణం పరిస్థితిని సమీక్షిస్తున్నారని, అధికార యంత్రాంగాన్ని సర్వం సిద్ధం చేశారని చెప్పారు.

 

Also Read : పోటెత్తుతున్న గోదావరి

ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని అన్నారు. వరద ప్రభానానికి గురైన గ్రామాల ప్రజలంతా సమీపంలోని సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలిపోవాలని కోరారు. స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటూ నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం వునరావాస కేంద్రాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించిందని బాధితులకు భోజనం, తాగు, ఇతర సదుపాయాలను కల్పించిందన్నారు. భయపడాల్సిన పనిలేదన్నారు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుందని చెప్పారు.లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం కేసీఆర్ రెండు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. వంద ప్రభావిత అన్ని గ్రామాల ప్రజల్ని సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించమని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని, రక్షణ సిబ్బంది, ఇరిగేషన్, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది వరద సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పారు.ఇప్పటి వరకు పరిస్థితి అదుపులోనే ఉందని.. భయపడాల్సిన పని లేదని నామ స్పష్టం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వరద సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారని నామ చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube