కర్షకుల కదనానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం   

కర్షకుల కదనానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం   

0
TMedia (Telugu News) :

 

వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం హర్షణీయం*
ఎంపీ నామ నాగేశ్వరరావు
టీ మీడియా,నవంబర్ 16,ఖమ్మం: కర్షకుల కదనానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గి మూడు సాగు వ్యతిరేక చట్టాలను రద్దు చేసిందని టీఆర్ఎస్ లోకసభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. సాగు చట్టాల రద్దుకు సంబంధించి ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై ఎంపీ నామ నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ చట్టాలు రైతుల మేలు కోసం కాదని తాము పార్లమెంట్లో లోపల, బయట గొంతెత్తి అరిచినా అప్పుడు కేంద్రం వినిపించుకోలేదని అన్నారు. 14 నెలల క్రితమే ఈ చట్టాలు లోకసభ, రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం మేరకు టిఆర్ఎస్ నేతృత్వంలో తాము ఎన్నో పోరాటాలు చేసినట్టు నామ గుర్తు చేశారు. దేశ సరిహద్దుల్లో జవాన్ కావాలి కాస్తుంటే మరో పక్క రైతులు దేశ ప్రజలకు కడుపు నింపుతున్నారని, అటువంటి రైతన్నకే కష్టాలు వచ్చాయని రైతులు, కార్మికులను రక్షించిందని సుమారు పది రాజకీయ, ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించామన్నారు. అయితే, అప్పుడు కేంద్ర ప్రభుత్వం తమ అభ్యర్ధనను పట్టించుకోలేదన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్, ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రైతు ఆందోళనల్లో పాల్గొనే మేజారిటీ రైతులంతా ఈ రెండు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారని అన్నారు. సీఎం కేసిఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని, వారి కోసం నిరంతరం పోరాటం కొనసాగుతుందన్నారు.సాగు చట్టాల రద్దు.. వ్యూహాత్మకమా? వెనక్కి తగ్గడమా?

 

AlSo  Read:నల్ల చట్టాలు రద్దులో ఎంపీ నామ పాత్ర

– తెలంగాణ ధాన్యం కూడా కొనుగోలు చేయాలి
దక్షిణ భారతంలోని ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రమైన తెలంగాణలో వడ్ల కొనుగోలు కోసం తాము పోరాడుతున్నామని, అందుచేత తమ వడ్లను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ నామ డిమాండ్ చేశారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా రైతు పండించిన పంటను కొనుగోలు చేస్తారని వ్యాఖ్యానించారు. ఆ విధంగా భారత రాజ్యాంగం ఉద్బోధిస్తుందని అన్నారు. ఇప్పటిదాకా కొని.. ఇప్పుడెందుకు కొనుగోలు చేయరు? అని ఆయన నిలదీశారు. యాసంగిలో వడ్లు ఎందుకు కొనరో రైతాంగానికి సమాధానం చెప్పాలన్నారు. వర్లు కొనే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పంట సేకరణలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఒక విధానం… పంజాబ్లో మరో విధానాన్ని అవలంభిస్తున్నదని ఎంపీ నామ నాగేశ్వరరావు మండిపడ్డారు. తెలంగాణలో రైతులు పండించిన ధ్యాన్యాన్ని ఎందుకు కొనరో రైతులకు వివరించాలన్నారు. తెలంగాణలో రైతాంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, వారికి అన్యాయం చేయాలని చూస్తే సహించేదిలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో ప్రస్తుతం రాష్ట్రంలో వరి ఎక్కువగా పండిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు నీళ్లున్నా వరి వేసుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం రైతులకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. తెలంగాణ బీజేపీ నేతలకు రైతులపై నిజంగా ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనేందుకు ఒప్పించాలని హితవు పలికారు.

Also R ead:సాగు చట్టాల రద్దు.. వ్యూహాత్మకమా? వెనక్కి తగ్గడమా?

లేనిపక్షంలో రైతుల కల్లాల దగ్గరికి తెలంగాణ బీజేపీ వెళ్లి రాజకీయం చేయడం మానుకోవాలని వారికి సూచించారు. కర్షకుల కదనానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గి మూడు సాగు వ్యతిరేక చట్టాలను రద్దు చేసిందని టీఆర్ఎస్ లోకసభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. సాగు చట్టాల రద్దుకు సంబంధించి ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై ఎంపీ నామ నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ చట్టాలు రైతుల మేలు కోసం కాదని తాము పార్లమెంట్లో లోపల, బయట గొంతెత్తి అరిచినా అప్పుడు కేంద్రం వినిపించుకోలేదని అన్నారు. 14 నెలల క్రితమే ఈ చట్టాలు లోకసభ, రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం మేరకు టిఆర్ఎస్ నేతృత్వంలో తాము ఎన్నో పోరాటాలు చేసినట్టు నామ గుర్తు చేశారు. దేశ సరిహద్దుల్లో జవాన్ కావాలి కాస్తుంటే మరో పక్క రైతులు దేశ ప్రజలకు కడుపు నింపుతున్నారని, అటువంటి రైతన్నకే కష్టాలు వచ్చాయని రైతులు, కార్మికులను రక్షించిందని సుమారు పది రాజకీయ, ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించామన్నారు. . దీంతో ఈ ప్రభావం రానున్న ఎన్నికలపై తప్పకుండా పడే అవకాశం ఉందని బీజేపీ ప్రభుత్వం గ్రహించిందని వార్తలు వస్తున్నాయని, అలా కాకుండా భేషరతుగా చట్టాలను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసిఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని, వారి కోసం నిరంతరం పోరాటం సాగుతుందన్నారు.4
💐

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube