పేదల పక్షపాతి ఎంపీ నామ

డిసిసిబి ఛైర్మన్ కురాకుల నాగభూషయ్య

1
TMedia (Telugu News) :

పేదల పక్షపాతి ఎంపీ నామ
డిసిసిబి ఛైర్మన్ కురాకుల నాగభూషయ్య
టీ మీడియా, ఏప్రిల్ 6,ఖమ్మం :టిఆర్ఎస్ లోక్సభ పక్షనేత , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేదల పక్షపాతి అని డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషయ్య అన్నారు . మంగళవారం నాడు ఎంపి నామ చొరవతో మంజూరైన సియం సహాయనిధి చెక్కులు ఖమ్మం ఎంపి క్యాంప్ కార్యాలయంలో రైతుబంధు సమితి ఖమ్మం జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు , టీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి లతో కలిసి ఆయన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

Also Read : ధర్నాచౌక్ ప్రాంగణం పరిశీలన

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సిఫార్సు తో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో పలు దఫాలుగా సియం సహాయ నిధి చెక్కులు పెద్ద మొత్తంలో వస్తున్నాయని అందులో భాగంగా ఈ రోజు 54 మంది లబ్ధిదారులకు రూ .25,91,000 లక్షల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులు అందించటం జరిగిందన్నారు .ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కనకమేడల సత్యనారాయణ , ముదిగొండ ఎంపీపీ సామినేని హరిప్రసాద్ , టిఆర్ఎస్ మాజీ మండలపార్టీ అధ్యక్షులు మీగడ శ్రీను , మార్కెట్ కమిటీ డైరెక్టర్ బంకా మలయ్య , జిల్లా నాయకులు పసుపులేటి వెంకట్, చిత్తారు సింహాద్రి యాదవ్ , బత్తుల శ్రీనివాసరావు , ఎంపిటిసి మన్నెం అప్పారావు , వెంకట నాగ ప్రసాద్ , ఉప్పనూతల నాగేశ్వరరావు , రావినూతల సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ , కొత్తూరు వెంకటేశ్వరావు , చింతలచెర్వు లక్ష్మి , చెరుకుమల్లి భిక్షం , ఏన్కూర్ మండల నాయకులు బాలాజీ , నరేష్ నామ సేవా సమితి సభ్యులు పాల్వంచ రాజేష్ , చీకటి రాంబాబు , తాళ్ళూరి హరీష్ బాబు , రేగళ్ల కృష్ణప్రసాద్ , భార్గవ్ పలువురు ప్రజాప్రతినిధులు , పార్టీ మండలాల ముఖ్య నాయకులు , అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube