నేటి నుండి జిల్లాలో టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ పర్యటన

నేటి నుండి జిల్లాలో టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ పర్యటన

1
TMedia (Telugu News) :

నేటి నుండి జిల్లాలో టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ పర్యటన
టి మీడియా,మే16,ఖమ్మం:నేటి నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పర్యటించనున్నారు. అందులో భాగంగా నేడు సోమవారం నాడు దిశా కమిటీ చైర్మన్ నామ నాగేశ్వరరావు ఉదయం 10.00 లకు ఖమ్మం, NSP క్యాంపులోని డి.పి.ఆర్.సి సమావేశ మందిరం నందు కేంద్ర ప్రభుత్వ పధకముల పై జిల్లా అభివృద్ధి, సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం లో పాల్గొంటారు.

Also Read : వెంటనే మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి

అనంతరం ఎంపీ నామ మధ్యాహ్నం 3 గంటల నుండి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం సుజాత్ నగర్ మండలంలో రూ” 636.00 లక్షల వ్యయంతో మంజూరైన సుజాత్ నగర్ నుండి రామవరం (చుంచుపల్లి మండలం) వయా నిమ్మలగడ్డ, గరీబ్ పేట వరకు బిటి రోడ్ నిర్మాణం శంకుస్థాపన తో పాటు రూ” 628.00 లక్షల వ్యయంతో సుజాత్ నగర్ నుండి రామవరం పోవు రహదారి పై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణంకు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షలు,రేగా కాంతారావు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య తో కలిసి పాల్గొనున్నారు. మరుసటి రోజు ఉదయం ఎమ్మెల్సీ, టి.ఆర్.ఎస్ ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి వైరా లో పలు రైతు వేదికల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఎంపీ క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube