మండలంలో టి.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావు విస్తృత పర్యటన.

0
TMedia (Telugu News) :

టీ మీడియా చింతకాని

మధిర నియోజకవర్గం, చింతకాని మండలంలో సోమవారం నాడు ఉదయం టిఆర్ఎస్
లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు విస్తృతంగా పర్యటించారు.అందులో భాగంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు తో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ముందుగా ప్రొద్దుటూరు గ్రామంలో గ్రామం నుండి మండల కేంద్రం చింతకానికి పి.ఎన్.జి ఎస్.వై క్రింద రూ.3 కోట్ల 23 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అలానే అనంతరం నాగులవంచ గ్రామంలో నాబార్డు వారి స్పెషల్ రి- ఫైనాన్స్ క్రింద రూ. 65 లక్షల రూపాయల తో సహకార సంఘం గోదాము నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా నాగులవంచ సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగానికి పెద్దపీట వేసి వారికి పలు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని గుర్తు చేశారు. అలానే సహకార సంఘాల ద్వారా రైతులకు ఎన్నో రకాల సహాయ సహకారాలు అందుతున్నాయని వాటిని రైతులు వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు,డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం,జిల్లా రైతు బంధు కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు,ఎంపీపీ పూర్ణయ్య,మండల జడ్పీటిసి పర్సగాని తిరుపతి కిషోర్,నాగులవంచ సొసైటీ చైర్మన్ నల్లమోతు శేషగిరిరావు,గ్రామ సర్పంచ్ నాగమణి,ఎంపీటీసీలు సరోజిని,నాగరత్నమ్మ, డీసీసీబీ అట్లూరి వీరబాబు,జిల్లా సహకార అధికారి విజయకుమారి,నాగులవంచ సహకార బ్యాంక్ మేనేజర్ నందూరి మజూష, నాగులవంచ సొసైటీ కార్యదర్శి యాలమూడి శ్రీనివాసరావు,మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య,వంకాయలపాటి లచ్చయ్య, నాగులవంచ రైతు వేదిక కన్వీనర్ వంకాయలపాటి సత్యనారాయణ, వైస్ ఎంపీపీ హనుమంతరావు,మంకెన రమేష్, సిలివేరి సైదులు అంబటి వెంకటి,నెల్లూరు రమేష్,పరిటాల ఎలమంద, కోపూరి నవీన్, సహకార బ్యాంక్ సిబ్బంది ఉపేందర్ రావ్,హరీష్ కుమార్,సింధు, పర్వతాలు, పడిశాల కెనడీ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

TRS on Monday morning in Madhira constituency Chintakani zone.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube