ఎంపీ నామ పరామర్శలు

ఎంపీ నామ పరామర్శలు

1
TMedia (Telugu News) :

ఎంపీ నామ పరామర్శలు

టీ మీడియా,నవంబర్ 9,ఖమ్మం : టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు బుధూరం ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ నామ ఖమ్మం కార్పొరేషన్, ఖమ్మం రూరల్, కూనుమంచి, నేలకొండపల్లి తదితర మండలాల్లో విస్తృతంగా పర్యటించి, పలు కుటుంబాలను పరామర్శించారు.

కూనుమంచి మండలం కేశవాపురం గ్రామంలో తాళ్లూరి వెంకటేశ్వర్లు, సీతయ్య, జీళ్ళచెరువు లో గోపె లక్ష్మయ్య కుటుంబ సభ్యులను రాజేశ్వరపురం లో ఆకుతోట ఆనంతలక్ష్మీ కుటుంబాన్ని కొత్తూరు లో వజ్ర వెంకటేశ్వర్లు కుటుంబాన్ని, నేలకొండపల్లి లో నర్పంచ్ రాయపూడి నవీన్ కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఇంకా ఖమ్మం రూరల్ మండలం కైకొండాయిగూడెంలో ఆళ్ల వెంకటేశ్వరరావు, దానావాయిగూడెంలో టీవీ రమణ, తీర్థాలలో తేజావత్ పాప, మాలోత్ మదార్, ముత్తగూడెంలో వెలిశెట్టి చెన్నయ్య, మాజీ సర్పంచ్ కొచ్చెర్ల లాలయ్య కుటంబాలతో పాటు, చింతపల్లిలో తోట జగన్, గుదిమళ్లలో పల్లా కోటేశ్వరరావు ఖమ్మంలో కనకమేడల గోపాలకృష్ణమూర్తి కుటుంబ సభ్యులను నామ పరామర్శించారు. ఈ సందర్భంగా నామ మృతుల చిత్ర పటాలకు పూలమాల వేసి, నివాళులు అర్పించారు.

Also Read : ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ నామ

ఈ కార్యక్రమాల్లో జిల్లా రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ మరికంటి ధనలక్ష్మి, దండా పుల్లయ్య, ఎంపిపి వజ్జా లక్ష్మీ నెల్లూరి భద్రయ్య, మంకెన వెంకటేశ్వర్లు. పార్టీ నాయకులు వీరవల్లి వెంకన్న, మలీదు మెంకన్న, తాళ్లూరి నృజన్, ఊడుగు వెంకటేశ్వర్లు అన్మూల శ్రీను, కొండా నత్యం, బి. రాజేష్ వజ్జా శ్రీను, రాఘువులు, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ నంబూరి శాంత సత్యనారాయణ, నూరపనేని రామకృష్ణ, రాయపూడి నవీన్ ఉన్నం బ్రహ్మయ్య, నంబూరి నత్యం, కడియాల శ్రీనివాసరావు, రామబ్రహ్మం, వి. రవి ఎంపీటీసీ బొందయ్య, వెంకట రమణ జక్కుల లక్ష్మయ్య, అనంతరం ఖమ్మంలో భవాని ఆర్థో పెడిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇంటూరి శేఖర్ తండ్రి ఇంటూరి వెంకటేశ్వర్లు ను నామ పరామర్శించి, ఇంటూరి శేఖర్ ను చికిత్స వివరాలు అడిగి తెలుసు కున్నారు. తర్వాత అక్కడే చికిత్స పొందుతున్న కొంతమంది రోగుల ను కూడా ఎంపీ నామ పరామర్శించి, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఖమ్మంలోని హరితా గార్డెన్ కు వెళ్లి అత్తులూరి రాజేష్ తల్లి కృష్ణకుమారి గారి పెద్ద కర్మకు హాజరయ్యారు. ఈసందర్భంగా రాజేష్ కుటుంబ సభ్యులను వివిధ పార్టీలు నాయకులను కలుసుకొని మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎన్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube