మధిర లో పర్యటించి న ఎంపీలునామ , వద్దిరాజు

జమాలపురం లోప్రత్యేక పూజలు

1
TMedia (Telugu News) :

 

మధిర లో పర్యటించి న ఎంపీలునామ , వద్దిరాజు

-జమాలపురం లోప్రత్యేక పూజలు

టీ మీడియా, జూన్27,మధిర/ఎర్రుపాలెం: తెరాస లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఆదివారం నాడు విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారితో కలసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముందుగా మధిర పట్టణంలోని రిపోర్టర్ అట్లూరి సాంబిరెడ్డి తండ్రి వీరారెడ్డి గారు ఇటీవల మరణించగా ఈ రోజు వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలానే సాయి నగర్ కాలనీ నందు దిల్ కుమార్ సోదరుడు దుర్గాప్రసాద్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి నివాసానికి, అలానే ఇటీవల ఇంటి నిర్మాణ గోడ కూలి ప్రమాదవశాత్తు మరణించిన అమర సత్యనారాయణ గారి నివాసానికి వెళ్లి వారి ఇళ్లల్లో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చివరగా సుందరయ్య నగర్ లోనితెరాస మండల పార్టీ అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావునివాసంలో ఏర్పాటు చేసిన లంచ్ కి హాజరయ్యారు.

Also Read : రెండు వర్గాల మధ్య ఘర్షణ..

ఈ కార్యక్రమాల్లో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు , జిల్లా నాయకులు మల్లాది వాసు , చావా రామకృష్ణ , పట్టణ పార్టీ అధ్యక్షుడు పల్లపోతు వెంకటేశ్వరరావు , ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, పట్టణ మరియు మండల పార్టీల కార్యదర్శులు అరిగే శ్రీనివాసరావు గారు, బొగ్గుల భాస్కర్ రెడ్డి , యువజన విభాగం నియోజకవర్గ కన్వీనర్ కూన నరేందర్ రెడ్డి , సోషల్ మీడియా నియోజకవర్గ ఇంచార్జ్ తాళ్లూరి హరీష్ బాబు , యన్నంశెట్టి అప్పారావు గారు, గడ్డం శేషుబాబు , రావూరి రాము , గద్దల నాని , తొగురు ఓంకార్ , పిడికిటి సాంబ , జెవి రెడ్డి , ఆళ్ల నాగబాబు , గద్దల రాజా , పరిసా శ్రీనివాసరావు , జగన్నాధ చారి , ఆవుల రామకృష్ణ , గుగులోతు కృష్ణ , రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎర్రుపాలెం మండల పర్యటన లో … తెరాస లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , తెరాస జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు , రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు గారు తదితరులు జమాలపురం లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ప్రజాప్రతినిధులకు ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో తుళ్ళూరి కోటేశ్వరరావు గారు, చావా రామకృష్ణ గారు, పంబి సాంబశివరావు గారు, గ్రామ సర్పంచ్ మూల్పూరి స్వప్న, ఎంపీటీసీ మూల్పూరి శైలజ , ఎంపీపీ దేవరకొండ శిరీష , జడ్పీటీసీ శీలం కవిత , డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వర రెడ్డి , సొసైటీ చైర్మన్ మూల్పూరి శ్రీనివాసరావు , ఆలయ ఈఓ, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube