మండలంలో విస్తృతంగా ఎంపి నామ పర్యటన

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం లు

1
TMedia (Telugu News) :

మండలంలో విస్తృతంగా ఎంపి నామ పర్యటన
– శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం లు
టి మీడియా, మే 6,ఎర్రుపాలెం:
మండలం లోనిరాజులదేవరపాడు గ్రామంలో పీఎం జిఎస్ వై క్రింద రూ.521.46 లక్షల రూపాయల వ్యయంతో మంజూరు అయినా సఖినవీడు – బుచ్చిరెడ్డిపాలెం, వయా రాజులదేవరపాడు రోడ్ నిర్మాణ పనులకు (8.92 కి.మీ),రూ. 1055.76 లక్షల వ్యయం తో సఖినవీడు నుండి బుచ్చిరెడ్డిపాలెం మధ్య హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఎంపీ నామ నాగేశ్వరరావు గురువారంశంకుస్థాపన చేశారు.తెరాస ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ,జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు ,తో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. పర్యటనలో భాగంగా ముందుగా ఎర్రుపాలెం ఇనగాలి గ్రామంలో నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ నుండి మంజూరు అయిన చేతి బోరు పంపు ను ప్రారంభించారు అదే గ్రామంలో ఇతర రాజకీయ పార్టీల నుండి పెద్ద ఎత్తున ఈ సందర్భంగా చేరారు టిఐఆర్ ఎస్ లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.

Also Read : పీడీఎస్ రైస్ పట్టుకున్నపోలీసులు

అనంతరం బనిగండ్ల పాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించారు అనంతరం మండలం పరిధిలోని రాజులదేవరపాడు గ్రామంలో పిఏ జిఎస్ వై క్రింద ఎంపీ నామ నాగేశ్వరరావు , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు చొరవతో రూ.521.46 లక్షల రూపాయల వ్యయంతో మంజూరు అయినా సఖినవీడు – బుచ్చిరెడ్డిపాలెం, వయా రాజులదేవరపాడు రోడ్ నిర్మాణ పనులకు (8.92 కి.మీ) అలానే పీఎం జిఎస్ వై నుండి మంజూరైన రూ. 1055.76 లక్షల వ్యయం తో సఖినవీడు నుండి బుచ్చిరెడ్డిపాలెం మధ్య హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క తో కలసి శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా తనకు కన్న తల్లి లాంటిదని పేర్కొన్నారు. మధిర నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు అనంతరం బుచ్చిరెడ్డిపాలెం గ్రామాల్లో నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ నుండి మంజూరు అయిన బోరుపంపు ఆయన ప్రారంభించారు అలానే గ్రామంలో సీనియర్ నాయకుడు నారాయణరెడ్డి ఇంటికి వెళ్లి పలకరించారు అలానే పార్టీ నాయకులు త్రివేణి నివాసానికి వెళ్లి పరామర్శించారు అనంతరం నరసింహపురం గ్రామంలో టిఆర్ఎస్ నాయకులు కాళేశ్వరరావు నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటాపురం గ్రామంలో ఇటీవల మరణించిన గౌరాజు వెంకట్రావమ్మ దశదిన పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. జమలాపురం గ్రామంలో తండా నందు వారి సంఘ నాయకుడు ఎన్నిక సందర్భంగా పాల్గొని అభినందించారు. రేమిడిచర్ల గ్రామంలో సామినేని రామచంద్రావు కుమారుడు జగదీష్ వివాహ రిసెప్షన్ కు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. కొత్తపాలెం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వీరంశేట్టి శ్రీనివాసరావు ను పరామర్శించారు అలానే కత్తి అచ్చుత్ రావు కుమార్తె వివాహ ఎంగెజ్ మెంట్ కు హాజరై ఆశీర్వదించారు అలానే కొత్తపాలెం గ్రామ సర్పంచ్ కత్తి నాగమణి ఇంటికి వెళ్లి పలకరించారు.

Also Read : పీడీఎస్ రైస్ పట్టుకున్నపోలీసులు

ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటిసి శీలం కవిత, మండల పార్టీ అధ్యక్షుడు పంబి సాంబశివరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వర రెడ్డి, ఎర్రుపాలెం సొసైటీ చైర్మన్ లు మూల్పూరి శ్రీనివాసరావు, అనుమోలు సాంబశివరావు, రైతు బంధు మండల కన్వీనర్ వేమిరెడ్డి బాలరాఘవ రెడ్డి, మండల పార్టీ కార్యదర్శి యన్నం శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షుడు మొగిలి అప్పారావు, వైస్ ఎంపీపీ రామకోటేశ్వరరావు ,ఎంపిటిసి లు కృష్ణా రావు , మల్లికార్జున్ రెడ్డి, కిషోర్ బాబు, సర్పంచ్ లు భాస్కర్ రెడ్డి, శివాజీ, జంగా పుల్లారెడ్డి, కృష్ణారెడ్డి, పురుషోత్తం రాజు,కోట శ్రీనివాసరావు, పెరుగు కృష్ణ ,శీలం ఉమామహేశ్వరి, నారాయణరెడ్డి, చుంచు విజయ్ ,యువజన అధ్యక్షులు కొండపాటి సాంబశివరావు, తన్నీరు రవి కుమార్ ,బాణాల వెంకటేశ్వర్లు, బొర్రా మురళి , బొర్రా నరసింహారావు, ఎస్ ఎల్ భాస్కర్ , లక్కిరెడ్డి కృష్ణా రెడ్డి, లక్కిరెడ్డి శేఖర్ రెడ్డి , పులి నాగయ్య, బొబ్బిళ్ళపాటి బాబురావు, ప్రశాంత్, పలకంటి సుధీర్ , పెనుగొండ రవి , ఆవుల ముత్తయ్య, గొల్లపూడి వెంకటేశ్వరరావు, నండ్రు రాంబాబు సహా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube