ప్ర‌తి ఒక్క‌రి దినచర్యలో యోగ ఒక భాగమ‌వాలి

-ఎంపీ నామ నాగేశ్వ‌రరావు

1
TMedia (Telugu News) :

ప్ర‌తి ఒక్క‌రి దినచర్యలో యోగ ఒక భాగమ‌వాలి
-ఎంపీ నామ నాగేశ్వ‌రరావు
టీ మీడియా,జూన్ 21హైద‌రాబాద్:ప్రతి ఒక్కరి దిన‌చ‌ర్య‌లో భాగంగా రోజూ యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత, ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వ‌రరావు సూచించారు. యోగ చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంద‌ని అన్నారు. దాంతో రోగ నిరోదక శక్తి పెరుగుతుందని తెలిపారు. భారతదేశం ప్ర‌పంచానికి చూపించిన యోగాను నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు వారు పాటిస్తున్నారన్నారని కొనియాడారు. ఈ పరిణామం భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు ప్రపంచ దేశాల్లో దక్కిన ఘనత అని నామ తెలిపారు. యోగ మానవ జీవన శైలిని సులభతరం చేసి ఆరోగ్యంతోపాటు మనిషి ఆనందంగా ఉండటానికి చాలా ఉపయోగకరమైనదన్నారు. యోగాకి వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు.

Also Read : రాజోలిలో ఘనంగా జయశంకర్ వర్ధంతి వేడుకలు

శారీరక మానసిక ఆరోగ్యం అందించే యోగ నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతోంద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. నేటి ఆధునిక యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో సమయం దోరికనప్పుడు యోగా ఆసనాలు వేయడం మొదలు పెడితే ప్రశాంతత మెరుగుపడుతుందన్నారు. ఎంపీ నామ ప్రతి రోజు యోగా ఆసనాలు వేస్తానని ఈ సందర్భంగా వెల్ల‌డించారు.ప్రతి ఒక్కరి దిన‌చ‌ర్య‌లో భాగంగా రోజూ యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత, ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వ‌రరావు సూచించారు. యోగ చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంద‌ని అన్నారు. దాంతో రోగ నిరోదక శక్తి పెరుగుతుందని తెలిపారు. భారతదేశం ప్ర‌పంచానికి చూపించిన యోగాను నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు వారు పాటిస్తున్నారన్నారని కొనియాడారు.

Also Read : పనులుపూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోండి

ఈ పరిణామం భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు ప్రపంచ దేశాల్లో దక్కిన ఘనత అని నామ తెలిపారు. యోగ మానవ జీవన శైలిని సులభతరం చేసి ఆరోగ్యంతోపాటు మనిషి ఆనందంగా ఉండటానికి చాలా ఉపయోగకరమైనదన్నారు. యోగాకి వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. శారీరక మానసిక ఆరోగ్యం అందించే యోగ నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతోంద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. నేటి ఆధునిక యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో సమయం దోరికనప్పుడు యోగా ఆసనాలు వేయడం మొదలు పెడితే ప్రశాంతత మెరుగుపడుతుందన్నారు. ఎంపీ నామ ప్రతి రోజు యోగా ఆసనాలు వేస్తానని ఈ సందర్భంగా వెల్ల‌డించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube