రావినూతల లో పర్యటించిన, ఎంపీ నామ

రావినూతల లో పర్యటించిన ఎంపీ నామ

2
TMedia (Telugu News) :

రావినూతల లో పర్యటించిన, ఎంపీ నామ
-పలు కుటుంబాలను పరామర్శ

 

టీ మీడియా,అక్టోబర్ 10,బోనకల్ : టీఆర్ఎస్ ( బీఆర్ఎస్ )సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సోమవారం ఉదయం బోనకల్ మండలం, రావినూతల గ్రామంలో పర్యటించారు ఈ పర్యటన లో భాగంగా గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల తో కలసి పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. ముందుగా సీపీఎం జిల్లా నాయకులు యనమదల విక్రమ్ గారి తండ్రి జోషి గారు ఇటీవల మరణించగా వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు అలానే వట్టికొండ రాధాకృష్ణ మూర్తి కుటుంబ సభ్యులను మరియు చేబ్రోలు రామారావు ,సీతమ్మ గారి కుటుంబ సభ్యులను వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా చిత్ర పటాలకు పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు , టీ.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లిఖార్జునరావు, గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ గారు, అంబటి సుధాకర్ గారు, సూర్యదేవర సుధాకర్ గారు, చావా హనుమంతరావు గారు, టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్ గారు, పార్టీ సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇంచార్జ్ తాళ్లూరి హరీష్ బాబు , భాగం నాగేశ్వరరావు , ఉద్దండు , సురేష్ , నరేష్ , కొండలు , గ్రామశాఖ అధ్యక్షుడు బంధం తిరుపతి , ప్రేమనందం , బాణోత్ కృష్ణ , మంగయ్య , రావూరి వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా నాయకులు వై. విక్రమ్ , దొండపాటి నాగేశ్వరరావు , జబ్బార్ గారు, గుగులోత్ పంతులు , గుగులోత్ నరేష్, నామ సేవా సమితి సభ్యులు చీకటి రాంబాబు , రేగళ్ల కృష్ణప్రసాద్ పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube