ఒదుగుతూ.ఎదగడం నా నైజం

గెలుపు పొందే వరకు ఆలుపులేదు

1
TMedia (Telugu News) :

ఒదుగుతూ.ఎదగడం నా నైజం
–గెలుపు పొందే వరకు ఆలుపులేదు
-నా జీవితం ప్రజాక్షేత్రానికే అంకితం
-మాజీ ఎంపీ పొంగులేటి

టీ మీడియా,సెప్టెంబర్ 6,పినపాక: ఒదుగుతూ ఎదగడం తన నైజమని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగిన నిగర్విగానే ఉంటానని.. అందరిలా ఎగిసిపడే మనస్తత్వం తనది కాదని మరోమారు స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులే తనకు శ్రీరామరక్ష అని వెల్లడించారు. గత మూడు రోజులుగా ఉమ్మడి ఖమ్మంజిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన సోమవారం పినపాక నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితాన్ని ప్రజాక్షేత్రానికే అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే తన ధ్యేయమన్నారు. రాబోవు ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసి తీరుతానని గెలుపుపొందే వరకు ఆలుపు లేకుండా శ్రమిస్తానని తెలిపారు.

 

Also Read : పూజ కార్యక్రమం లో జడ్పిటిసి

ప్రజల ఆశీస్సులతో రాబోవు ఎన్నికల్లో తన విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి మణుగూరు మండలంలోని బండారుగూడెం, మణుగూరు గ్రామాలు, అశ్వాపురం మండలంలోని మిట్టగూడెం, అమెంతకాలనీ, అశ్వాపురం, సీతారాంపురం,మొండికుంట గ్రామాలు, బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం, మొరంపల్లి బంజర, బూర్గంపాడు, రెడ్డిపాలెం, సారపాక గ్రామాలను సందర్శించారు. పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆర్థికసాయాలను అందజేశారు. ఆపదలో నేనున్నా మీ శీనన్నను అనే భరోసాను కలిగించారు. అదేవిధంగా పోలవరం ముంపు బాధితులు చేస్తున్న దీక్షకు తన మద్దతు తెలిపి ప్రసంగించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube