కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా రద్దు

కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా రద్దు

0
TMedia (Telugu News) :

కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా రద్దు
టీ మీడియా, ఏప్రిల్ 14, న్యూఢిల్లీ : కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల ప్రత్యేక సీట్ల కోటాను రద్దయ్యింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ అన్ని విద్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఏటా ఒక్కో ఎంపీకి పది సీట్లు కేటాయించింది. తాజాగా ఉత్తర్వులతో ఆ కోటా పూర్తిగా రద్దయ్యింది. పార్లమెంట్‌ సభ్యులతో పాటు ఇతర కోటాల కింద భర్తీ చేసే సీట్ల భర్తీ ప్రక్రియను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే, కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఎంపీల కోటాను పెంచాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న తరుణంలో కోటా మొత్తం రద్దు చేయడం గమనార్హం.అయితే, లోక్‌సభలోనూ కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాపై చర్చ జరిగింది. అయితే, కోటాను ఎత్తి వేయాలని కొందరు.. పెంచాలని మరికొందరు కోరారు.

Also Read : ముఖ్యమంత్రికి పాలాభిషేకం

దీంతో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి చర్చించనున్నట్లు కేంద్రం ఆ సమయంలో ప్రకటించింది. ఈ విషయమై స్పీకర్‌ ఓం బిర్లా సైతం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆదేశించారు. పది సీట్ల కోటా సరిపోదని.. దాన్ని పెంచాలని.. లేదంటే రద్దు చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారి డిమాండ్‌ చేశారు. అయితే, ఎంపీల కోటాను రద్దు చేసే యోచనలో ఉందని ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఆ సమయంలో మంత్రి నిర్ణయాన్ని పలువురు ఎంపీలు వ్యతిరేకించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube