వెంకటేశ్వరిని దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు

వెంకటేశ్వరిని దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు

0
TMedia (Telugu News) :

వెంకటేశ్వరిని దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు

టీ మీడియా,జనవరి 20,తిరుమల : రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి శుక్రవారం ఉదయం కలియుగ ఇష్ట దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా వారు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేశారు.ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభ విజయవంతం అయినట్లుగానే పార్టీ ఆధ్వర్యంలో జరిగే సభలు, సమావేశాలన్నీ కూడా దిగ్విజయం కావాలని, తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించాలని కోరుతూ భగవంతున్ని వేడుకున్నారు.అలాగే మహానేత కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ మాదిరిగా యావత్ దేశం సుభిక్షంగా వర్థిల్లాలని స్వామివారిని ప్రార్థించారు.

Also Read : టీటీడీలో విద్యుత్‌ ఆదాకు పటిష్ట చర్యలు : ఈవో

ఎంపీ రవిచంద్రతో పాటు పెట్రోలియం, సహజవాయువు శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.వేద పండితులు మంత్రోచ్ఛరణాల మధ్య అంక్షితలు వేసి రవిచంద్ర, విజయలక్ష్మీ గార్లను,ఇతర ఎంపీలను ఆశీర్వదించారు, శాలువాలతో సత్కరించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube