సస్పెన్షన్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

సస్పెన్షన్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

1
TMedia (Telugu News) :

సస్పెన్షన్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

టి మీడియా, జూన్ 6 ,మహబూబ్‌నగర్ : మినీ ట్యాంక్ బండ్‌లో చేపట్టిన ఐలాండ్, సస్పెన్షన్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను మంత్రి తనిఖీ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్నందున పెద్ద చెరువులో పూడిక తీసే పనులను వేగవంతం చేయాలన్నారు.అదేవిధంగా సస్పెన్షన్ బ్రిడ్జి పనులు, ఐలాండ్ పనులు కూడా త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఒకేసారి ఐలాండ్ , తీగల వంతెన, నెక్లెస్ రోడ్డు నిర్మాణం పనులన్ని జరిగేలా చూడాలన్నారు. అవసరమైతే మరింత మంది లేబర్, యంత్రాలను ఉపయోగించి పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.ఈ సందర్భంగా వర్షపు నీరు చెరువులో చేరకుండా అదేవిధంగా మురికి నీరు చెరువు లోకి రాకుండా బయటికి పంపేలా తీసుకోనే చర్యల పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌కు పలు సూచనలు చేశారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కె నరసింహులు, ముడా చైర్మన్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇరిగేషన్ ఇంజినీర్లు, తదితరులు ఉన్నారు.

Also Read : మిద్దె తోట..ఆరోగ్యానికి పూలబా

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube