మంచి నాయకుడికి అన్యాయం

-ఎంపీ వెంకటేష్ నేత

1
TMedia (Telugu News) :

మంచి నాయకుడికి అన్యాయం
-ఎంపీ వెంకటేష్ నేత
టీ మీడియా,April1 పెద్దపల్లి :నిత్యం పేద ప్రజలకు సేవలు చేస్తూ నాయకుడిలా కాకుండా సేవకుడిలా పనిచేసే మంచి నాయకుడికి అన్యాయం జరిగిందని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బొర్లకుంట వెంకటేష్ నేత పేర్కొన్నారు.మంథని మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.ఆనాడు మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధు అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో నిలిచారని,అయితే మళ్లీ జరిగిన ఎన్నికల్లో ఆయనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ;రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ గా అజయ్ మిశ్రా బాధ్యతల స్వీకరణ

పదవిలో ఉన్నా లేకున్నా పేద ప్రజలకు సేవ చేయాలన్న తపన పుట్ట మధులో ఉందన్నారు. తనకు ఎంపీ ల్యాండ్ ద్వారా ప్రతి ఏటా ఐదు కోట్ల నిదులు వస్తాయని, అయితే కరోనా విపత్కర పరిస్థితుల నేపధ్యంలో ఆ నిదులు పీఎం రిలీఫ్ ఫండ్కు వెళ్తున్నాయని అన్నారు. ఈసారి మాత్రం ఆ నిదుల్లో సగం ఇవ్వాలని కోరడం జరిగిందని,తనకు వచ్చే నిదుల్లో అత్యదిక నిదులతో పాటు తన సమయాన్ని మంథని నియోజకవర్గ అబివృద్ది కోసమే కేటాయిస్తానని భరోసా ఇచ్చారు.తన పార్లమెంట్ పరిదిలో ఏడు నియోజకవర్గాలు ఉండగా అందులో ఆరుగురు ఎమ్మెల్యేలు మనవారేనని ఇక్కడ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెందిన వారన్నారు.

ALSO READ;ఒక కుటుంబానికి ఒకే పింఛన్‌ దారుణం

ఈ క్రమంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధు వ్యక్తిగతంగా చేస్తున్న ప్రజా ఉపయోగకరమైన పనులతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలతో మంథనిని ప్రగతిపథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరు సమిష్టిగా ప్రభుత్వానికి మంచిపేరు తీసుకువచ్చేలా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈప్రాంతంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి తన వంతు కృషి చేస్తానన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube