మూడోసారి కేసీఆర్ నే సీఎం

-కేసీఆర్ తోనే మరింత అభివృద్ధి

0
TMedia (Telugu News) :

మూడోసారి కేసీఆర్ నే సీఎం

-కేసీఆర్ తోనే మరింత అభివృద్ధి

-తెలంగాణ దేశానికే మార్గదర్శి

-రైతు బంధు పధకం ప్రపంచంలో ఎక్కడా లేదు

– రైతు వేదికలను ప్రారంభించిన ఎంపీ నామ

టీ మీడియా, ఫిబ్రవరి 21,కారేపల్లి : బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వరరావు మంగళవారం వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ , ఎమ్మెల్సీ తాతా మధుతో కలసి కారేపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఉసిరికాయలపల్లి, అప్పాయిగూడెం, రోట్టమాకిరేవులలో నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ మూడో సారి కూడా కేసీఆర్ నే సీఎం అని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో సీఎం గా కేసీఆర్ గెలిస్తేనే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.

 

అభివృద్ధి, సంక్షేమం లో తెలంగాణ దేశానికే మార్గదర్శిగా నిలిచిందన్నారు.రైతు బంధు పధకం, రైతు వేదికలు , ఫ్రీ కరెంట్ వంటి పధకాలు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. అది కేసీఆర్ కే సాధ్యమైందన్నారు.తెలంగాణ పధకాలు గురించి పార్లమెంటులో మాట్లాడు తుంటే ఎంపీలంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారని అన్నారు. తెలంగాణ పధకాలు మాకు కావాలని మిగతా రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారని నామ పేర్కొన్నారు. రానున్నకాలంలో సీఎం కేసీఆర్ కు మనమంతా అండగా ఉండాలన్నారు. ఎన్ని కలప్పుడు వచ్చి కనిపించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమాల్లో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్, ఎంపీపీ శకుంతల, మండల పార్టీ అధ్యక్షులు ఉమాశంకర్, జెట్పీటీసీ జగన్, సీనియర్ నాయకులు ముత్యాల

Also Read : శ్రీకృష్ణ ఆలయంలో భక్తులను దీవిస్తున్న ఏనుగు..

సత్యనారాయణ, రావూరి శ్రీనివాసరావు, జిల్లా టెలికం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్, గొడ్డేటి మాధవరావు, శ్రీయుతులు బత్తుల శ్రీను, బన్సీలాల్, జ్యోతి, జాలా సాంబ, సుజాత, సక్ర, నరేష్, రాంబాబు, పాండ్యనాయక్, దుగ్గినేని శ్రీనివాసరావు, అరుణ, కోటేశ్వరరావు, హీరాలాల్, రోశయ్య, పిల్లలమర్రి స్వర్ణ, రాములు, నరేష్, సర్పంచులు అరుణ, కల్పన, విజయ, భద్రమ్మ, ఉమారాణి, పద్మ, మంగమ్మతో పాటు దిశ సభ్యులు కుమార్, నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ నామకు మహిళలు హారతులు ఇచ్చి, నుదటిన తిలకం దిద్ది ,పూలు చల్లి, ఘన స్వాగతం పలికారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube