సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపిడిఓ

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 28, మహానంది:

మహానంది మండలంలోని మహానంది గ్రామ సచివాలయంను ఎంపిడిఓ సుబ్బరాజు ఆకస్మిక తనిఖీ చేసి, బయో మెట్రిక్, సిబ్బంది హాజరు పట్టిక,వాలంటీర్ల పనితీరును పంచాయతీ సెక్రటరీ లక్ష్మి ప్రసన్న ను అడిగి తెలుసుకున్నారు.తదనంతరం పార్వతీపురం కాలనీ ప్రక్కన కోనేటి కాలువ యందు పూడికతీతపనులు, డ్రైనేజీ సమస్యలను,మహానంది ఆలయ ఈవో మల్లికార్జున ప్రసాద్ తో ఎంపిడిఓ సుబ్బరాజు చర్చించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మల్లికార్జున ప్రసాద్,ఆలయ అధికారులు మాట్లాడుతూ పార్వతీపురం కాలనీకు సంబందించి డ్రైనేజీ సమస్యపై పూర్తి స్థాయిలో దేవస్థానం తరపున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. త్వరలో కోనేటి కాల్వకు సంబందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్బ రాజు, మండల ఇంజనీరింగ్ అధికారి రాముడు, ఆలయ ఏఈఓ మధు, ఏవో వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ఇంజనీర్ రవికుమార్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ రెడ్డి , ఎలక్ట్రీషియన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

MPDO Subbaraju conducted a surprise inspection of the Mahanandi village secretariat in the Mahanandi zone.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube