కరోనా థర్డ్‌ వేవ్‌ పై అప్రమత్తంగా ఉండాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 27, మహానంది:

మహానంది మండల కేంద్రమైన యం. తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు కోవిడ్ 19 థర్డ్ వేవ్ నియంత్రణలో భాగంగా ముంచుకొస్తున్న ఒమిక్రాన్ కరోనా థర్డ్‌ వేవ్‌ ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలని వైద్య సిబ్బందికి, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లకు ఎంపీడీవో సుబ్బరాజు, తాసిల్దార్ జనార్దన్ శెట్టి అవగాహన కల్పించారు. సోమవారం తిమ్మాపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మూడో విడత కరోనా ప్రమాదం గురించి గ్రామాల్లో ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. ప్రజలను గుంపులుగా ఒకచోట చేరకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. భౌతిక దూరం పాటించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ జనార్దన్ శెట్టి, ఎస్‌ఐ సిసి నాగార్జున రెడ్డి,ఎంపీడీఓ సుబ్బ రాజు, మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ చంద్ర శేఖర్, చిన్న లింగన్న, గాజులపల్లి డాక్టర్ ఎస్తేర్ వందన, సూపర్ వైజర్ సుగుణమ్మ, ఆరోగ్య మిత్ర చంద్ర శేఖర్, పియచ్ సి సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube