వీఆర్వోల సమస్యలు పరిష్కరించాలి

వీఆర్వోల సమస్యలు పరిష్కరించాలి

1
TMedia (Telugu News) :

వీఆర్వోల సమస్యలు పరిష్కరించాలి

టీ మీడియా, జులై 19, వనపర్తి బ్యూరో : ప్రభుత్వం తక్షణమే వీఆర్వోల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చల కూర పరమేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసే జీవో నెంబర్ 29, 2020 ద్వారా విఆర్వో జాబ్ చాట్ రద్దు పరిచిన కొందరు కలెక్టర్లు, తహసీల్దార్లు ప్రభుత్వం వీఆర్వోల జాబ్ చాట్ రద్దు ఉత్తర్వులను ఉల్లంఘింఛీ వీఆర్వోలను మేము చేసిన వీధులు నిర్వహించకపోతే మీకు జీతాలు ఆపుతామని బెదిరిస్తున్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దు అయిన తర్వాత కూడా సస్పెండ్ చేస్తూ భయపెట్టి వీధులు నిర్వహింప చేస్తున్నారు. విఆర్వో అవసరం ఉన్నప్పుడు విఆర్వోలు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమ విధులు భారంగా ఉన్నాయని సీఎం, సిఎస్ లకు నీవేదించాల్సిన అధికారులు వీఆర్వోలను బ్లాక్ మెయిల్ చేసి బలవంతపు విధులు నిర్వహించడం ప్రజల నిబంధనలు ఉల్లంఘించడమే వీరిని సంఘ పరంగా ఎదుర్కొంటాం మా సర్వీస్ కు భంగం కలిగిస్తే ఉద్యమాలు తప్పవు న్యాయస్థానాలు సైతం ఆశ్రయిస్తాం అన్నారు .ఈ సందర్భంగా వాళ్ల డిమాండ్స్ వివరించారు. వీఆర్వోలకు జాబ్ చాట్ ప్రకటించాలి, ప్రమోషన్లు కల్పించాలి, అకాల మరణం పొందిన వీఆర్వోలకు కుటుంబాల్లో కారుణ్య నియామకాలు ఇవ్వాలి, ఈ విషయంపై క్లారిఫికేషన్ కు కలెక్టర్లు సీసీఎల్ఏకు సిసిఎల్ఎ ప్రభుత్వానికి నివేదించిన పరిష్కారం లేక సంబంధిత కుటుంబాలు మానసికంగా ఆర్థికంగా విద్యా, వైద్య, పరంగా ఇబ్బందులు పడుతున్నారు.

 

 

Also Read : పార్లమెంట్ లో ఓటు హక్కు వినియోగించుకున్నఎంపీ నామ

ఆయన ప్రభుత్వం కనికరించడం లేదు. వివిధ కారణాల వల్ల సస్పెన్షన్కు గురైన వారికి తిరిగి పోస్టింగ్స్ ఇవ్వాలి, సర్వీస్ క్రమబద్ధీకరించాలి, వీఆర్వోల అందరినీ రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలి, ప్రభుత్వం కళ్లు ఉండి చూడలేని, చెవులు ఉండి వినలేని, నోరు ఉండి మాట్లాడలేని విధంగా వీఆర్వోల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం అభ్యంతరకరం. వ్యవస్థ రద్దు అయిన తర్వాత కూడా కొన్ని జిల్లాల అధికారులు వీఆర్వోలను తదితర శాఖలోకి డిప్యుటేషన్పై భూసంబంధమైన, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సర్టిఫికెట్ల విచారణ అన్ని రకాల విధులు బలవంతంగా నిర్వహిస్తున్నారు. ఇది ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు విఆర్వోలతో అవసరం ఉన్నట్టయితే ప్రభుత్వానికి నివేదించాలి అని వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి బచ్చలకూర పరమేశ్వర్, జిల్లా అధ్యక్షులు శరవంద, కార్యవర్గ సభ్యులు ఉమారాణి, యమునా, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రాజ్ , వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube