మొక్కులు చెల్లించిన ముదిరాజ్ లు

మొక్కులు చెల్లించిన ముదిరాజ్ లు

1
TMedia (Telugu News) :

మొక్కులు చెల్లించిన ముదిరాజ్ లు

టి మీడియా,జులై22, పెద్దపల్లి :జిల్లా కేంద్రంలోని స్థానిక తెలుగువాడలో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో పట్టణంలోని ముత్యాల పోచమ్మ మరియు నల్ల పోచమ్మ అమ్మవార్లకు వాడలో మహిళలందరూ బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుల్లతో అంగరంగ వైభవంగా ఊరేగింపుతో తల్లులకు బోనాలు సమర్పించడం జరిగింది.

 

Also read : రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి

భక్తులు భక్తితో బోనాలతో మొక్కులు చెల్లించి వాడలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సుఖసంపదలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుని మొక్కులు చెల్లించడం జరిగింది. అమ్మవార్లకు వాడ నుండి ప్రతి ఏటా బోనాలు చెల్లించి మొక్కులు తీర్చుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగువాడలోని మహిళలు, కుల పెద్ద మనుషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube