శ్రీవారిని దర్శించుకున్న ముఖేశ్‌ అంబానీ

శ్రీవారిని దర్శించుకున్న ముఖేశ్‌ అంబానీ

1
TMedia (Telugu News) :

శ్రీవారిని దర్శించుకున్న ముఖేశ్‌ అంబానీ

టీ మీడియా ,సెప్టెంబర్ 16, తిరుమల: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబాని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుమల చేరుకున్న అంబానీ శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు చేశారు.

Also Read : క‌రెన్సీ నోట్ల‌పై మోదీ బొమ్మ ముద్రిస్తారేమో

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనను ఆశీర్వదించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు ప్రతిఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ముఖేశ్‌ అంబానీకి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube