వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

1
TMedia (Telugu News) :

వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

 

టీ మీడియా, అక్టోబర్ 6, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణంలో గురువారం పర్యటించిన మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ బుధవారం వనపర్తి పట్టణంలో రాత్రి కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పరిశీలించారు. రాత్రి కురిసిన భారీ వర్షంతో గోపాల్పేట రోడ్ జరిపోతుల వాగు డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోవడం జరిగింది.

Also Read : ఎవరొచ్చినా వైసీపీని ఏమీ చేయలేరు   

విపరీతంగా వాగు పారడంతో అక్కడికి వెళ్లి వాహన దారులను పాదచారులను దారి మళ్ళించారు.కాంట్రాక్టర్ ను వెంటనే మరమ్మతులు చేపట్టాలని రాకపోకలకు ఇబ్బంది కలగకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా తాళ్ళచెరువు వాగును పరిశీలించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇతర ప్రాంతాలకు రాకపోకలను రెండు మూడు రోజులు వాయిదా వేసుకోవాలని పిలుపునిచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube