మున్సిపల్ కౌన్సిలర్ నుకాల్చివేత
టి మీడియా,ఆగస్టు1,చండీఘఢ్ : ఆప్ మున్సిపల్ కౌన్సిలర్‌ను దుండగుడు కాల్చిచంపాడు. పంజాబ్ మలెర్‌కోట్ల జిల్లాలోని ఓ జిమ్ లోపల ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి జిమ్ లోపలికి చొచ్చుకువచ్చి ఆప్ కౌన్సిలర్ మహ్మద్ అక్బర్‌పై కాల్పులు జరిపాడని జిల్లా ఎస్పీ అవనీత్ కౌర్ సిద్ధూ చెప్పారు.
Also Read : ఎన్కౌంటర్లో డివిజన్ కమిటీ కమాండ్ మృతి
అక్బర్ శరీరంలోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లగా అతడు అక్కడిక్కడే మరణించాడని చెప్పారు. వ్యక్తిగత కక్షతోనే ఈ హత్య జరిగిందని అనుమానిస్తున్నామని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయని అన్నారు. హత్య ఉదంతం సీసీటీవీ కెమెరాలో రికార్డయిందని పోలీసులు చెప్పారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube