పారిశుద్ధ్య పనులు పరిశీలించిన వైస్ చైర్మన్

పారిశుద్ధ్య పనులు పరిశీలించిన వైస్ చైర్మన్

1
TMedia (Telugu News) :

పారిశుద్ధ్య పనులు పరిశీలించిన వైస్ చైర్మన్

టీ మీడియా, జూన్ 30, వనపర్తి బ్యూరో : పట్టణంలోని జంగిడిపురం కాలనీలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పరిశీలించారు. గురువారం పట్టణంలోని 30వ వార్డు పరిధిలోని జంగిడిపురంలో ఇటీవల కురిసిన వర్షానికి ఇండ్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాలలో వరద నీరు, డ్రైనేజీ నీరు చేరి అస్తవ్యస్తంగా మారింది. సమస్యను గుర్తించిన మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ జెసిబితో తాత్కాలిక కాలువలు ఏర్పాటు చేసే, మోటారుతో మురుగునీరును తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు అయినా కాలనీలు కాబట్టి డ్రైనేజీ వ్యవస్థ, వరద కాలువల సమస్య తీవ్రంగా ఉందన్నారు.

 

Also Read : విద్యార్థులు ఎవరు తొందరపాటు చర్యలకు పాల్పడవద్ద

 

పట్టణంలోని పీర్లగుట్ట, టీచర్స్ కాలనీ, రామాలయం వీధి వంటి తదితర ప్రాంతాల నుంచి చిన్నపాటి వర్షం కురిసిన లోతట్టు ప్రాంతమైన జంగిడిపురం కాలనీలోకి వరద నీరు, మురుగునీరు వచ్చి చేరుతుందని అన్నారు. ప్రస్తుతం జెసిపి, మోటార్ల సహాయంతో ఇళ్ల మధ్యలో చేరిన మురుగునీరును తొలగించే పనులు చేపట్టడం జరిగిందన్నారు. త్వరలోనే సమస్యలను మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టి తీసుకెళ్లి కాలనీలో నూతనంగా వరద కాలువల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. మురుగునీరు పూర్తిగా తొలగించిన అనంతరం బ్లీచింగ్ పౌడర్ చల్లించి దోమల వ్యాప్తిని అరికడతామని అన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన వైస్ చైర్మన్ శ్రీధర్ కు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగిడిపురం కాలనీ ప్రెసిడెంట్ కురుమయ్య, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube