నవంబర్ 14 న భగవాన్ భీర్స ముండాజయంతి

నవంబర్ 14 న భగవాన్ భీర్స ముండాజయంతి

0
TMedia (Telugu News) :

నవంబర్ 14 న భగవాన్ భీర్స ముండాజయంతి

టీ.మీడియా,అక్టోబర్..24,చింతూరు:
పేగా పంచాయతీ సూరకుంట గ్రామంలో గొండ్వాన అధ్యయన కేంద్రం లో గోరం రాఘవ మరియు యూత్ లీడర్ నుప చందు అధ్యక్షతన జరిగిన సమావేశం లో పేగా పంచాయితీ సర్పంచ్ గారు పాయం చంద్రయ్య మరియు ఆదివాసీ సంక్షేమ పరిషద్ సమన్వయ కర్త మాడవి నెహ్రు తెలంగాణ గొండ్వాన ఘనతంత్ర పార్టీ అధ్యక్షులు ఉమ్మలా దుర్గారెడ్డి గారు, ఆదివాసీ ఎంప్లాయిస్ యూత్ పాల్గొన్నారుపాయం చంద్రయ్య పేగా సర్పంచ్ గారు మాట్లాడుతూ నవంబర్ 14 నా భగవాన్ భీర్స ముండా గారి ముందస్తు జయంతి వేడుకలు ముందస్తు గానే రెండు రోజులు కార్యక్రమం చెయ్యాలని 11/11/2022 మొదటి రోజున సెమినార్ పెట్టి అవగాహన కార్యక్రమం, రెండొవ రోజున అనగా 12/11/2022 న సభ ఏర్పాటు చెయ్యలని గ్రామస్థులకు పంచాయితీ కమిటీలకు సూచించారు.     

 

ALSO READ ;బస్సును ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

ఆదివాసీ సంక్షేమ పరిషద్ సమన్వయ కర్త మాడవి నెహ్రు గారు మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలు విద్యార్థులు నాయకులు బిర్సా ముండా గారి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత వున్నదని అన్నారు రానున్న రోజులో ఆదివాసీలా ఆస్తిత్వ మనుగడ అనుమరుగయ్యే ప్రమాదం ఉందని, అందరు మేల్కొన్ని హక్కులకై పోరాటం చెయ్యాలన్నారు ఈ కార్యక్రమంను అందరూ కూడా విజయవంతం చెయ్యాలని నాయకులు యూవత ఉద్యోగులు చట్టాల పై అవగాహనా ఉండాలన్నారు.

ALSO READ :లోన్ వేధింపులకు వ్యక్తి మృతి

 

దేశయ్య  మాట్లాడుతూబిర్సా ముండా గారు (1875–1900) భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు అని జానపద నాయకుడు ఇతడు ముండా జాతికి చెందిన.19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించారని . తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారని ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హల్ లో వున్నదని ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక ఆటవిక జాతుల నాయకుడు బిర్సా ముండా.బ్రిటిషు వలసవాదంపై తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వాత్రంత్ర్య పోరాటంలో పాల్గొన్న యోధునిగా బిర్సా ముండా పేరును అత్యంత గౌరవంతో ప్రస్తావిస్తారు అంతటి యోధుని గురించి తెలుసుకునే బాధ్యత అందరికి ఉందని ప్రతి ఒక్కరు కూడా11,12, తారీకు న 2 రోజుల కార్యక్రమంను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంకి సూరకుంట యూత్ సెక్రటరీ కోటేష్,పూజారి జోగయ్య గారు,సాంబయ్య,కుంజా జోగయ్య , క్రాంతి,అర్జున్, సరిత, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube