పార్కును సందర్శించిన మున్సిపల్ చైర్మన్
టీ మీడియా, నవంబర్ 30, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో కేడిఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న 32వ వార్డు లో ఉన్న పార్కును సందర్శించారు అక్కడ ఉండే వివిధ రకాల మొక్కలను వ్యాయామ పరికరాలను పరిశీలించారు. అనంతరం 32 వ వార్డు, 11వ వార్డు పరిసరాల్లో ఉన్న వార్డుల్లో ముఖ్యులతో కౌన్సిలర్ నాగన్న యాదవ్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్, వనపర్తి టిఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు మాధవరావు సునీల్ వాల్మీకి, తదితరులు పాలమూరులో జరిగే డిసెంబర్ నాలుగున జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు తరలి రావాలని సమాయత్తం చేయడం జరిగింది.ఈ సందర్భంగా పాల్గొన్న వార్డు కౌన్సిలర్లు పార్టీ ముఖ్యులు కార్యకర్తలు అందరిని దిశా నిర్దేశం చేయడం జరిగింది.