మున్సిపల్ కౌన్సిలర్లు నిరసన

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 30 వనపర్తి : వనపర్తి పట్టణ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో 23 వవార్డు మరియు 33 వవార్డు లో మున్సిపల్ చెత్త టాక్టర్ చెడిపోయి రెండు నెలలు అయినా ఇంతవరకు రిపేరు చేయలేదు. అలాగే 23 మరియు 33 డ్రైనేజీ తీయడానికి కామాటీ లేక మూడు నెలలు అవుతుంది. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకు వచ్చిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. చెత్త ట్రాక్టర్ లేక కామాటీ లేక స్థానిక కౌన్సిలర్లను వార్డ్ ప్రజలు తిట్టే పరిస్థితి వచ్చిందని అందుకు నిరసనగా మంగళవారం రోజు మున్సిపల్ 23 కౌన్సిలర్ నందిమల్ల భువనేశ్వరి 33 వ వార్డు కౌన్సిలర్ ఉంగ్లం అలేఖ్య మీటింగ్లో ప్లే కార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube