జీవో ప్రకారం జీతాలు చెల్లించాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 28 వనపర్తి : వనపర్తి మున్సిపల్ కార్యాలయం ముందు మంగళవారం మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని జీవో నెంబర్ 60 అమలు చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) అనుబంధం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ప్రధానంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇస్తున్నట్టుగా వేతనాలు పెంచాలని జీవో నెంబర్ 60 వచ్చే ఆరు నెలలు అయినా ఇప్పటికీ అమలు చేయలేదని వెంటనే జీవో నెంబర్ 60 ప్రకారం కేటగిరీల వారీగా 15600/-, 19000/-, 22750/- ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది .11 పి.ఆర్.సి వేతనాలు పంతొమ్మిది వేల ఐదు వందలు 22750/-, 31వేల40 కూడా జీవో సవరించి పదకొండవ పిఆర్సి అమలు చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ మున్సిపాలిటీ వలె ఏరియస్ తో సహా వేతనాలు వెంటనే పెంచాలన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు పుట్ట ఆంజనేయులు ,జిల్లా కార్యదర్శి యాదగిరి ,పట్టణ అధ్యక్షులు కురుమయ్య, పట్టణ ఉపాధ్యక్షుడు చంద్రయ్య, సహాయ కార్యదర్శి సురేందర్, నాయకులు శాంతయ్య, బాలు, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube