ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నా మునిసిపల్ సిబ్బంది..

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్22, మధిర:

మధిర మున్సిపాలిటీలో పందులు నిర్మూలనకు అధికారులు చేపట్టే చర్యలు శూన్యం అని అదే విధంగా ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు ఇప్పటికైనా స్పందించి శాశ్వత నిర్మూలన చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పట్టణంలోని రాజీవ్ నగర్లో సెంట్ ఫ్రాన్సిస్ స్కూల్ కి వెళ్లే రహదారిలో నిరంతరం పందులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయని అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో నివాసగృహాల సమీపంలో పందులు పెంచుతున్న వారిప్తెవార్డు సభ్యులు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఎటువంటి ఫలితం లేకపోగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, స్కూలుకు వెళ్ళే విద్యార్థులపై పందులు ఎప్పుడు దాడి చేస్తాయోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి పందుల నిర్మూలనకు కృషి చేయాలన్నారు.

Municipal staff neglecting public health.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube