దుకాణదారులు మూత కలిగిన గ్రీన్,బ్లూ,రెడ్ డబ్బాల ఏర్పాటు చేసుకోవాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్31, మధిర:

మధిర మున్సిపాలిటీ వాణిజ్య ప్రాంతాలలో,ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేసే వ్యాపార సంస్థల వారు మూత కలిగిన గ్రీన్ , బ్లూ, రెడ్ డబ్బాలను ఏర్పాటుచేసి తడి చెత్తను గ్రీన్ డబ్బాలో, బ్లూ డబ్బాలో పొడి చెత్తను,రెడ్ డబ్బాలో ప్రమాదకరమైన వ్యర్ధాలను వేరువేరుగా విభజించాలని తెలిపారు. అదే విధంగా తడి వ్యర్ధాలను కంపోస్ట్ ఎరువు గా మీ ఇంటి వద్ద ఉపయోగించుకోవచ్చునీ పొడి వ్యర్థాలను 100% రీ సైకిల్ చేసి ఏజెన్సీలకు విక్రయించడం జరుగుతుందాని తెలిపారు.
పత్రి రోజు ప్రమాదకర వ్యర్థాలను మీ షాపు దగ్గర ఉంచి మునిసిపల్ వాహనాలకు అందించలని తెలిపారు. ఈ సూచనలను ఖచ్చితంగా అనుసరించిన వార్డులను లిట్టర్ ఫ్రీ ఏరియా గా ప్రకటించడం జరుగునని తెలిపారు.
అదేవిధంగా దీనివల్ల డంపింగ్ యార్డ్ పై ఒత్తిడి తగ్గుతుందని, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించగలమనీ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube