ఐటి, ఈడి దాడులను ఖండించిన మున్నూరుకాపు సంఘం

ఐటి, ఈడి దాడులను ఖండించిన మున్నూరుకాపు సంఘం

1
TMedia (Telugu News) :

ఐటి, ఈడి దాడులను ఖండించిన మున్నూరుకాపు సంఘం

టి మీడియా, నవంబరు 10,ఖమ్మం : మున్నురుకాపు ముద్దు బిడ్డలు రాష్ట్ర మంత్రి గంగుల కమాలకర్ , ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇళ్లు , కార్యాలయాలపై ఈడి , ఐటి దాడులను కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీ , రాష్ట్ర సహయ కార్యదర్శి శెట్టి రంగారావు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.. దశాబ్దలుగా నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్న వారిపై కక్ష పూరితంగ వ్వవహరించడం సరి కాదన్నారు.. వేల కోట్ల రూపాయలు బ్యాంకర్లకు కుచ్చుటోపి పెట్టిన దొంగలను వదిలి నిజాయితీగా వ్యాపారం చేసుకుంటు ప్రజా జీవితం నెరపుతున్న బిసి ల పై అకారణ దాడులు దేనికి సంకేతమని వారు ప్రశ్నించారు..

Also Read : రాష్ట్రాలు కూలుస్తున్న కేంద్రం

కమాలకర్ , రవి చంద్ర లకు తెలంగాణ వ్యాపితంగా తమ కులబాందవులు అండగా ఉంటామన్నారు..ఇప్పటికైన పాలకులు తాము చేస్తున్నది సరైందో కాదో పునరాలోచన చేసుకోవాలని హితవు చెప్పారు. ఇప్పడిపుడే సామాజికంగా ., ఆర్దికంగా , రాజకీయంగా బలోపేతమవున్న కాపుల పై కేంద్రం తన వైఖరి ని మార్చుకోవాలన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube