మున్సిపాలిటీ బడ్జెట్ కిఆమోదం

0
TMedia (Telugu News) :

మున్సిపాలిటీ బడ్జెట్ కిఆమోదం

టీ మీడియా,ఫిబ్రవరి 21,ఇల్లందు: నియోజక వర్గ మున్సిపాలిటీ పాలకవర్గం ప్రవేశపెట్టిన 2022 బడ్జెట్ ప్రత్యేక సమావేశానికి ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఎమ్మెల్సీ మధుసూదన్*, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారితో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు మరియు పాలకవర్గం ప్రవేశపెట్టిన 2022 బడ్జెట్ ను వారు ఆమోదించారుమున్సిపల్ పరిధిలో రెవిన్యూ ఆదాయాన్ని పెంచుకునేందుకు తీసుకుంటున్న చర్యలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ గార్లతో కలిసి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

      ఇది కూడా చదవండి:మీడియాకు కబేళా ముడుపులు ..!

మున్సిపాలిటీ పరిధిలో రెవెన్యూ ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ సలహా సూచనలు అందించారు. మున్సిపాలిటీ పరిధిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా వార్డు కౌన్సిలర్ సహాయసహకారాలతో మున్సిపల్ చైర్మన్ తీసుకుంటున్న చర్యలను వారు అభినందించారు. ఉత్తమ మున్సిపాలిటీగా నిలిచినందుకు గర్వంగా ఉందని రానున్న రోజుల్లో కూడా ఇదే ఉండటంతో ఇల్లందు నియోజకవర్గం మరియు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు దోహదం చేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ గారితో కలిసి మున్సిపాలిటీ భవనం లో నూతనంగా నిర్మిస్తున్న సమావేశ మందిరంను ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు పాలకమండలి తో కలిసి వారు పరిశీలించారు.

ఇది కూడా చదవండి:ఆత్మీయ మిత్రుడిని కోల్పోయానుఎరువుల తయారీ కేంద్రం పరిశీలన
మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు గారితో కలిసి ఇల్లందు మున్సిపల్ ప్రత్యేక చొరవతో ఏర్పాటుచేసిన ఎరువుల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. మున్సిపాలిటీ సేకరించిన చెత్తను నుండి ఎరువుల తయారీ చేస్తున్నా విధానాన్ని వారు అడిగి తెలుసుకున్నారు.

    ఇది కూడా చదవండి:  మేయర్ పై కేసు నమోదు 
అనంతరం ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి వీధి వ్యాపారస్తుల సముదాయం వెండర్ జోన్ ను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ప్రారంభించారు. వీధి వ్యాపారస్తులకు కేటాయించిన నూతన షాపులను యజమానులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంజన్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ జానీ పాషా, మార్కెట్ చైర్మన్ హరి సింగ్ నాయక్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube