చౌటుప్పల్‌ ప్రజలపై రాజగోపాల్‌ రెడ్డి అసంతృప్తి

-కౌంటింగ్‌ కేంద్రం నుంచి బయటకు

1
TMedia (Telugu News) :

చౌటుప్పల్‌ ప్రజలపై రాజగోపాల్‌ రెడ్డి అసంతృప్తి

-కౌంటింగ్‌ కేంద్రం నుంచి బయటకు

టీ మీడియా,నవంబర్6,మునుగోడు : కారు దూసుకెళ్తున్నది. మొదటి రౌండ్‌ నుంచి ప్రత్యర్థి పార్టీలపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ పార్టీ 613 ఓట్లతో ముందంజలో ఉన్నది. దీంతో బీజేపీ అభ్యర్థి నైరాశ్యంలో కూరుకుపోయారు. తనకు పూర్తిగా పట్టున్న చౌటుప్పల్‌ మండలంలో అనుకున్నంతగా ఓట్లు పోలవలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఓట్లు మాత్రం రాలేదని చెప్పారు. మండల ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గుచూపడంతో నిరాశగా కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి.

Also Read : రూ.4.07కోట్లతో అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపనలు

చౌటుప్పల్ మండల పరిధిలోని నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 26443 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 25729, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 7380, బీఎస్పీ అభ్యర్థి ఆందోజు శంకర్‌కు 907 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా టీఆర్ఎస్ 714 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube