ఐదో రౌండ్లో టీఆర్ఎస్ లీడ్

ఐదో రౌండ్లో టీఆర్ఎస్ లీడ్

1
TMedia (Telugu News) :

ఐదో రౌండ్లో టీఆర్ఎస్ లీడ్

టి మీడియా, నవంబర్ 6, మునుగోడు : నాలుగు రౌండ్లు ప్రకారం టీఆర్ఎస్ ముందంజలో ఉంది. 714 ఓట్లు లీడ్‌లో టీఆర్ఎస్ ఉందని ఈసీ వెల్లడించింది. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ లో అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ లో ఆధిక్యం కనబచరిన టీఆర్ఎస్.. ఆ వెంటనే వెనుకబడి.. తిరిగి మళ్లీ వెంటనే పుంజుకుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్.. బీజేపీకి మంచి పట్టుందని భావించిన చౌటుప్పల్ మండలంలో తొలి రౌండ్ లో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత 2,3 రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలోకి రాగా.. నాలుగో రౌండ్ ముగిసేసరికి తిరిగి టీఆర్ఎస్ పుంజుకుంది. వెరసి బీజేపీకి మంచి పట్టుందని భావించిన చౌటుప్పల్ లో టీఆర్ఎస్ 613 ఓట్ల ఆధిక్యత సాధించింది..మునుగోడు ఓట్ల లెక్కింపులో తొలుత చౌటుప్పల్ మండల పరిధిలోని ఓట్ల లెక్కింపు జరిగింది.

Also Read : చౌటుప్పల్‌ ప్రజలపై రాజగోపాల్‌ రెడ్డి అసంతృప్తి

ఈ మండలంలోని ఓట్లను మొత్తంగా 4 రౌండ్లలో లెక్కించగా… టీఆర్ఎస్ కు 613 ఓట్ల ఆధిక్యత లభించింది. తొలి రౌండ్ లో వెయ్యికి పైగా ఓట్ల ఆధిక్యాన్ని సాధించిన టీఆర్ఎస్.. ఆ వెంటనే 2, 3 రౌండ్లలో వెనుకడిపోయింది. అయితే నాలుగో రౌండ్ తో చౌటుప్పల్ మండలం ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సరికి బీజేపీని వెనక్కు నెట్టేసి తిరిగి టీఆర్ఎస్ ఆధిక్యంలోకి దూసుకువచ్చింది. నాలుగో రౌండ్ లో ఏకంగా 1,034 ఓట్ల ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్.. ఓవరాల్ గా బీజేపీపై 613 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో రౌండ్ లెక్కింపుతో చౌటుప్పల్ మండల ఓట్ల లెక్కింపును పూర్తి చేసిన అధికారులు.. ఆ తర్వాత సంస్థాన్ నారాయణపూర్ మండల ఓట్ల లెక్కింపును మొదలుపెట్టారు.
కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందవద్దు – భట్టి విక్రమార్క
ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇది ఒక సాధారణ ఉప ఎన్నిక మాత్రమే అని అన్నారు. ఈ ఎన్నికల ప్రభావం రానున్ను ఎన్నికల పైన ఉండదన్నారు. ప్రజాస్వామ్య ని అపహాస్యం చేయడం కోసం జరిగిన ఎన్నిక ఇదని అభివర్ణించారు.

Also Read : రూ.4.07కోట్లతో అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపనలు

చౌటుప్పల్ మండలంలో అనుకున్న మెజార్టీ రాలేదు-బీజేపీ అభ్యర్థి
రాజగోపాల్‌రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. చౌటుప్పల్ మండలంలో అనుకున్న మెజార్టీ రాలేదన్నారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకైతే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందన్న ఆయన.. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయని చెప్పారు. చివరి వరకు హోరాహోరీ పోరు తప్పక పోవచ్చని అభిప్రాయపడ్డారు. బీజేపీ గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలావుంటే మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలవారు ఆసక్తి మునుగోడు ఉప ఎన్నికను పరిశీలస్తున్నారు.అయితే విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. నెల రోజుల ఉత్కంఠకు నేడు తెర పడనుంది. ఉప ఎన్నికలో తమదే విజయమని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రౌండ్ల తర్వాత 613 ఓట్లతో టీఆర్ఎస్ అధిక్యంలో ఉంది.

Also Read : వెజ్ ,నాన్ వెజ్ మార్కెట్ పనులు పరిశీలించిన మంత్రి పువ్వాడ

ముంత్రులు ఇంఛార్జీలుగా ఉన్న చోట కారుకు బ్రేకులు..
తొలి రౌండ్‌లో లీడ్ దక్కించుకున్న టీఆర్ఎస్.. ఆతర్వాత వెనుకబడింది. రెండో రౌండ్ నుంచి ఐదవ రౌండ్ వరకు బీజేపీ ఆధిక్యం దక్కించుకుంది. అయితే మంత్రులు ఇంఛార్జీలుగా వ్యవహరించిన మండలాల్లో బీజేపీకి లీడ్ రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. మంత్రి మల్లారెడ్డి ఇంఛార్జ్ గా ఉన్న ఆరెగూడెం, కాటరేవురెడ్డివారి గ్రామంలో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. మరోవైపు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంఛార్జిగా ఉన్న లింగోజిగూడెంలోనూ బీజేపీనే అధిక్యంలోకి వచ్చింది. మరో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న దేవులమ్మ నాగారంలో బీజేపీ లీడ్ వచ్చింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube