మునుగోడులో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి

1వ తేదీ సాయంత్రం 6 నుంచి మైక్‌లు బంద్‌: సీఈవో

1
TMedia (Telugu News) :

మునుగోడులో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి

-1వ తేదీ సాయంత్రం 6 నుంచి మైక్‌లు బంద్‌: సీఈవో

టీ మీడియా,అక్టోబర్ 29,హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నికల పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసిం ది. నవంబర్‌ 3న జరిగే ఎన్నికలో 2,41,805 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలోని105 సమస్యాత్మకమైన పోలింగ్‌ బూత్‌ల వద్ద ప్రత్యేకంగా భద్రతా చర్యలు చేపడుతున్నారు. బూత్‌కు ఒకరు చొప్పున మైక్రో అబ్జర్వర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు పోలింగ్‌ ప్రక్రియను వెబ్‌ కాస్టింగ్‌ చేయనున్నారు.

నవంబర్‌ 1 సాయంత్రంతో ప్రచారం బంద్‌

నవంబర్‌ 1 సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనున్నట్టు సీఈవో వికాస్‌రాజ్‌ చెప్పారు. ఆ తర్వాత ప్రచారం చేస్తే ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. గడువు తర్వాత స్థానికేతరులు ఉండకూడదన్నారు.

Also Read : సంచార సైన్స్ లేబొరేటరీ

ప్రచారం మరింత ఉద్ధృతం

ఎన్నికల ప్రచారానికి నాలుగు రోజులే గడువు ఉండడంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 30న టీఆర్‌ఎస్‌, 31న బీజేపీ, నవంబర్‌ 1న కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకొంటున్నాయి. అయితే, చివరి నిమిషంలో బీజేపీ తన బహిరంగ సభను రద్దు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube