నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక

షెడ్యూల్ విడుదల..

1
TMedia (Telugu News) :

నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక

– షెడ్యూల్ విడుదల..

టీ మీడియా ,అక్టోబర్3,హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠగా మారిన మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయింది. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం దేశ వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో భాగంగా మునుగోడు కు ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 7న మునుగోడు బై పోల్ కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 15న నామినేషన్ల ను పరిశీలిస్తారు.

Also Read : పారిశుద్ధ్య కార్మికులకు బిందెలు దుప్పట్లు వితరణ

17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. నవంబర్ 3న ఎన్నిక…నవంబర్ 6న కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే మునుగోడులో ఉప ఎన్నికకు సంబంధించి ప్రధాన పార్టీలు సిద్దమయ్యాయి. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తో పాటుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి స్రవంతి రెడ్డి అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్నారు. టీఆర్ఎస్ అధికారికంగా తమ అభ్యర్దిని ప్రకటించలేదు. కానీ, ఎన్నికల ప్రచారం మాత్రం కొనసాగిస్తోది. ఈ రోజు లేదా రేపు టీఆర్ఎస్ తమ అభ్యర్ధిని అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube